Allu Arjun Statue మేడమ్ తుస్సాడ్స్ దుబాయ్ (Allu Arjun Statue) మ్యూజియంలో అల్లు అర్జున్ మైనపు విగ్రహావిష్కరణ జరిగింది. దుబాయ్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి అల్లు అర్జున్ హాజరైయ్యాడు. ఇక అల్లు అర్జున్ తొలి సినిమా ‘గంగోత్రి’ మార్చి 28న, 2003లో విడుదలైంది. సరిగ్గా ఇరవైవొక్క సంవత్సరాలకు మార్చి 28నే దుబాయ్‌లోని మేడమ్ తుప్సాడ్స్ కార్యాలయంలో అల్లు అర్జున్ మైనపు విగ్రహాం ఆవిష్కరణ జరగడం విశేషం. దుబాయ్‌లోని మేడమ్ తుస్సాడ్స్ విగ్రహాం కలిగి ఉన్న దక్షిణాది తొలి నటుడు అల్లు అర్జున్.
తొలి నటుడు ప్రభాస్
మేడమ్ తుస్సాడ్స్ మ్యూజియంలో ఆల్రెడీ ప్రభాస్, మహేశ్‌బాబు, కాజల్ అగర్వాల్, శ్రీదేవిల మైనపు విగ్రహాలు ఆవిష్కరించబడ్డాయి. అయితే వీరి విగ్రహాలు మేడమ్ తుస్సాడ్స్ మ్యూజియాలు ఉన్న ఆయా ప్రాంతాల్లో ఉన్నాయి. మేడమ్ తుస్సాడ్స్ నెలకొల్పిన తొలి ఇండియన్ నటుడు ప్రభాస్. బ్యాకాంక్లోని మేడమ్ తుస్సాడ్స్ కార్యాలయంలో ప్రభాస్ విగ్రహాం ఉంది. సింగపూర్‌లో శ్రీదేవి, మహేశ్‌బాబుల విగ్రహాలు ఉన్నాయి.
బర్త్ డేకి టీజర్
ఇక సినిమాల విషయానికి వస్తే …దర్శకుడు సుకుమార్ ‘పుష్ప’ ఫ్రాంచైజీలోని మలిభాగం ‘పుష్ప: ది రూల్’ సినిమాతో బిజీగా ఉన్నారు అల్లు అర్జున్. ఈ సినిమా ఆగస్టు 15న విడుదల కానుంది. షూటింగ్ కాస్త అటుఇటు అయితే రిలీజ్ వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. ఇక అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా ‘పుష్ప: దిరూల్’ సినిమా లేటెస్ట్ టీజర్‌ను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. ఒకట్రెండు రోజుల్లో ఈవిషయంపై అధికారిక ప్రకటన రానుందని తెలిసింది. మైత్రీ మూవీమేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
థర్డ్పార్టు: పుష్ప ది రోర్
AlluArjun Pushpa3: పుష్ప 3 ఉంటుంది: అల్లు అర్జున్
ఇక ‘పుష్ప’ సినిమా మూడోభాగం ‘పుష్ప: ది రోర్’ కూడా ఉంటుందని, ఆల్రెడీ చిత్రీకరణ మొదలైం దని సమాచారం. ‘పుష్ప: ది రూల్’ సినిమా రిలీజ్ రెస్పాన్స్‌ను బట్టి, ‘పుష్ప: ది రోర్’ను రిలీజ్ ఆధారపడి ఉంటుంది.
AlluArjun PushpaTheRule: పుష్పరాజ్‌కు డిసెంబరు సెంటిమెంట్?
ఇక ఈ సినిమాలే కాకుండా..సందీప్రెడ్డివంగాతో ఓ సినిమా, త్రివిక్రమ్‌తో మరో సినిమాకు అల్లు అర్జున్ కమిటైయ్యారు. కాగా ఈ సినిమాలు ప్రారంభం కావడానికి ఇంకా సమయం ఉందని, దీంతోఅట్లీతో సినిమాను సెట్స్‌పైకి తీసుకుని వెళ్లాలనే ఆలోచనలో అల్లు అర్జున్ ఉన్నారని తెలిసింది. అల్లు అర్జున్బర్త్ డే సందర్భంగా ఈ అట్లీ సినిమాపై ఓ క్లారిటీ వచ్చే చాన్సెస్ ఉన్నాయి.