Manjummel Boys Telugu Review: బ్లాక్‌బస్టర్ సినిమాలు ‘పులిమురుగన్’, ‘లూసీఫర్’, ‘ప్రేమలు’, ‘2018’లను దాటి ‘మంజుమ్మల్ బాయ్స్’ (Manjummel Boys Telugu Review) చిత్రం మలయాళ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదలైన ఈ సినిమా థియేటర్స్‌లో ఇంకా ప్రదర్శించబడుతోంది. కేవలం 20 కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా సర్వైవల్ డ్రామా ఇప్పటికే 200 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్స్‌ను సాధించింది. తాజాగా ‘మంజుమ్మల్ బాయ్స్’ తెలుగు వెర్షన్ ఏప్రిల్ 6న తెలుగులో విడుదలైంది. టాలీవుడ్ టాప్ నిర్మాణ సంస్థల్లో ఒకటైన మైత్రీ మూవీమేకర్స్ ఈ సినిమాను తెలుగులో విడుదల చేసింది. మరి..ఈ సినిమా తెలుగు ఆడియన్స్‌ను కూడా మెప్పించిందా? మన టాలీవుడ్ హబ్ రివ్యూలో చదివేద్దాం….
సినిమా: మంజుమ్మల్బాయ్స్
దర్శకుడు: చిదంబరం
ప్రధాన తారాగణం: సౌభిన్ షాహిర్, శ్రీనాథ్ బాసి, గణపతి, ఖలీద్ రెహమాన్, జార్జ్, చందు
నిర్మాతలు: బాబు షాహిర్, సౌబిన్ షాహిర్, షాన్ ఆంటోనీ
సంగీతం: శ్యామ్
కెమెరా: షైజు ఖలీద్
ఎడిటింగ్: వివేక్
జానర్: సర్వైవల్ డ్రామా (సెన్సార్ ‘యు’(యూనియర్సల్ ఆడియన్స్))
నిడివి: 133 నిమిషాలు
విడుదల తేదీ: ఏప్రిల్ , 2024 (తెలుగు వెర్షన్ థియేట్రికల్ విడుదల)
కథ
ఓనమ్ పండక్కి రెండ్రోజులు ముందు కొచ్చిలోని మంజుమ్మల్ బాయ్స్ పదిమంది కలిసి తమిళనాడులోని కొడైకేనాళ్కు టూర్ వెళ్తారు. ప్రదేశాల సందర్శన ప్రక్రియలో భాగంగా గుణకేవ్స్ లొకేషన్స్‌లోకి వెళ్తారు. గుణకేవ్స్లోని రిస్ట్రిక్టిటెడ్ ఏరియాలోకి వెళ్లిన ఈ ఆకతాయి కుర్రాళ్లల్లో ఒకరైన సుభాష్ పొరపొటున ఓ పెద్ద గుహలాంటి లోయలో పడిపోతాడు.
డెవిల్ కిచెన్‌గా చెప్పుకునే ఈ గుహలో పడితే చనిపోవడమే తప్ప మరో మార్గం లేదని అక్కడి స్థానికులు, ప్రభుత్వ అధికారుల నమ్మకం. మరి…సుభాష్‌ను అతని స్నేహితులైన మిగతా తొమ్మిదిమంది ఏ విధంగా కాపాడారు? ఈ మంజుమ్మల్ బాయ్స్ గ్రూప్‌లో పెద్ద వాడైన కుట్టన్ ఎలాంటి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నాడు? సుభాష్‌ను ప్రాణాలతో రక్షిం చేందుకు అక్కడి ఫారెస్ట్ డిపార్ట్మెంట్, పోలీస్‌డిపార్ట్‌మెంట్, రెస్యూ టీమ్స్…ఎలాంటి సహాయ సహకరాలను అందించారు? అన్నదే ఈ చిత్రం మిగిలిన కథ.
FamilyStar Review: విజయ్‌దేవరకొండ ఫ్యామిలీస్టార్ రివ్యూ
విశ్లేషణ
కథ సింపుల్….గుహలో పడిపోయిన స్నేహితుడిని కాపాడటం. కానీ దర్శకుడు చిదంబరం ఈ పాయింట్‌ను డీల్ చేసిన తీరు మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. మంజుమ్మల్ బాయ్స్ టూర్‌కు వెళ్లడం, అక్కడి డెవిల్ కిచెన్ గుహలో సుభాష్ చిక్కుకుపోవడంతో తొలిభాగం ముగుస్తుంది. చెప్పాలంటే…అసలైన కథ మలిభాగంలోనే మొదలవుతుంది. సుభాష్‌ను రక్షించడం కోసం మంజుమ్మల్ బాయ్స్ ఏ విధంగా చేశారు? ముఖ్యంగా కుట్టన్ ప్రాణాలకు తెగించి, గుహలోకి దిగడం వంటి అంశాలు ఆడియన్స్‌కు ఆసక్తి కలిగిస్తాయి. కథ కేవలం రెస్క్యూ ఆపరేషన్ అయితే ఈ సర్వైవల్ డ్రామాకు ఇంత మైలేజ్ వచ్చి ఉండకపోవచ్చు. తమతో టూర్‌కు వచ్చిన స్నేహితుడిని ఎలాగైనా తిరిగి తమతో పాటు ఊరికి తీసుకువెళ్లాలని స్నేహితులు పడే తపన, ప్రభుత్వఅధికారుల నుంచి స్పందన కరువైన పట్టువదలని స్నేహితుల తీరు, వారి ఐక్యమత్యం, ప్రాణలకైన తెగించాలనే వారి మొండి వైఖరి ఆడియన్స్‌ను ఎమోషనల్‌గా కనెక్ట్ చేస్తాయి. ఉద్వేగానికి లోను చేస్తాయి. కేవలం ఈ సీన్స్ మాత్రమే కాకుండా…కుట్టన్‌కు, సుభాష్‌కు చిన్నతనంలోనే ఉన్న ఓ ఎమోషనల్ బాండింగ్‌ను అక్కడక్కడ చూపిస్తూ ఆడియన్స్‌ను కథలోకి మరింత లీనం చేసిన దర్శకుడు చిదంబరం ప్రతిభ ప్రశంసనీయం.
కథ రిత్యా సుభాష్ గుహపడిలో ఓ కొండ చరియలాంటి ప్రాంతంలో ఉండిపోతాడు. అయితే అంత పెద్ద వర్షం పడినప్పుడు, వర్షంతో పాటుగా మట్టి కూడా కొట్టుకుని ఆ గుహలోకి వెళ్లినప్పుడు, ఆ కొండచరియ చివర్లో ఉన్న సుభాష్ మరింత కిందకు వెళ్లాలి. కానీ అలాంటిది ఏమీ కనిపించదు. అలాగే కుట్టన్ కూడా చెప్పులతో రోప్ సాయంతో గుహలోకి దిగినట్లుగా కొన్ని సీన్స్‌లో కనిపిస్తాయి. రోప్ సాయంతో గుహలోకి వెళ్లినప్పుడు, అందులోనూ వర్షం పడినప్పుడు చెప్పులతో గుహలోకి వెళితే మరింత జారిపోతాం. కానీ ఇక్కడ ఇలాంటిది ఏదీ ఉండదు. 120 అడులకుపైగా ఉన్న గుహలో గాయపడ్డ సుభాష్ కానీ, ఇతనికీ సాయం చేసే కుట్టన్ కానీ శ్వాస తీసుకోవడంలో ఎలాంటి ఇబ్బందులు పడరు. ఇది కాస్త నమ్మశక్యంగా అనిపించదు. ఈ విషయాల్లో దర్శకుడు కాస్త సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నట్లుగా అనిపిస్తుంది. 2006లో జరిగిన ఓ వాస్తవ సంఘటన ఆధారంగా ఈ సినిమా తీశారు.
RajamouliSSMB29: రాజమౌళి అలా చేస్తే మహేశ్‌బాబు చాలా లక్కీ!
నటీనటులు
కుట్టన్ ఆలియాస్ సిజు డేవిడ్ పాత్రలో సౌబిన్ షాహిర్ మంచి రోల్ చేశాడు. సెకండాఫ్ అంతా ఇతని పాత్ర తోనే సినిమా ముందుకు నడుస్తుంది. సుభాస్ పాత్రలో నటించిన శ్రీనాథ్ బాసిను మెచ్చుకో వాల్సిందే. స్క్రీ న్పై కాస్త తక్కువగా కనిపించిన సినిమాకు బ్యాక్‌బోన్‌లాంటి రోల్ చేశాడు. ఇక మంజు మ్మల్ బాయ్స్ గ్రూప్ ఫ్రెండ్స్‌గా బాలు వర్గీస్, గణపతి, దీపక్, అభిరామ్, అరుణ్, ఖలీద్ రెహమాన్, చందు వంటి వారు చేశారు. అభి లాష్ పాత్రలో కనిపించిన చందు క్లైమాక్స్‌లో ఆడియన్స్‌కు గుర్తుండి పోతాడు. ఫారెస్ట్ గార్డు వేలాయుదంగా మణి, లొకల్ గైడ్ డామినిక్గా రామచంద్రన్, లోకల్ షాప్ ఓనర్‌గా జార్జ్ మరియన్ వారి వారి పాత్రల మేరకు చేశారు.
ఇక మంజుమ్మల్ బాయ్స్ సినిమా టెక్నికల్‌గా చాలా స్ట్రాంగ్ అని చెప్పుకోవచ్చు. షైజు ఖలీద్ సినిమా టోగ్రఫీ బాగుంటుంది. ముఖ్యంగా లోయలో సన్నివేశాల విజువల్స్‌లో షైజు పనితనం కనిపిస్తుంది. సుసిన్ శ్యామ్ మ్యూజిక్ బాగుంటుంది. వర్షం పడేప్పుడు, సుభాష్‌ను పైకి తెచ్చినప్పుడు వచ్చే ఆర్ఆర్ అదిరిపోతుంది. వివేక్ హర్షన్ ఎడిటింగ్ బాగుంది.