Tillu Square Review: సిద్దుజొన్నలగడ్డ హీరోగా నటించిన ‘డీజేటిల్లు’ సినిమా సూపర్‌హిట్‌గా నిలిచింది. ముఖ్యంగా టిల్లు క్యారెక్టరైజేషన్‌కు ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. ఈ క్రైమ్ కామెడీజానర్లోనే మళ్లీ ‘టిల్లు స్క్వేర్’(Tillu Square Review) అంటూ ‘డీజేటిల్లు’ సిని మాకు సీక్వెల్ తీశారు. మరి….‘డీజేటిల్లు’ మ్యాజిక్ ‘టిల్లుస్క్వేర్’లోనూ రిపీట్ అయ్యిందా? రివ్యూలో చూద్దాం.
సినిమా : టిల్లుస్క్వేర్
ప్రధాన తారాగణం: సిద్దు జొన్నలగడ్డ, అనుపమాపరమేశ్వరన్, మురళీ శర్మ, మురళీధర్ గౌడ్, ప్రిన్స్
దర్శకుడు: మల్లిక్ రామ్
కథ–రచన: సిద్దు జొన్నలగడ్డ
నిర్మాణం: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య
మ్యూజిక్: భీమ్స్ సిసిరోలియో (ఆర్ఆర్), అచ్చురాజమణి– రామ్ మిరియాల (సంగీతం)
కెమెరా:సాయి ప్రకాష్
విడుదల తేదీ: మార్చి 29, 2024
కథ
Tillu Square: డీజే టిల్లు 2 నుంచి తమన్ అవుట్
బాలగంగాధర తిలక్ ఆలియాస్ టిల్లు ఓ ఈవెంట్ మేనేజ్మెంట్ రన్ చేస్తుంటాడు. పాత యవ్వరాలు అన్నీ మర్చిపోయి హ్యాపీగా లైఫ్‌ను లీడ్ చేద్దామనుకుంటున్న సమయంలో టిల్లు లైఫ్‌లోకి లిల్లీ వస్తుంది. ఓ ఈవెం ట్లో లిల్లీని చూసి టిల్లు పడిపోతాడు. టిల్లుపై లిల్లీ కూడా మనసుపారేసుకుంటుంది. అలా వారిద్దరి మధ్య ఓ రాత్రి గడిచిపోతుంది. మర్నాడు టిల్లుకి లిల్లీ కనిపించదు. లిల్లీ రాసిన ఓ చిన్న లెటర్ మాత్రం కని పిస్తుం ది. కానీ లిల్లీని బాగా ఇష్టపడ్డ టిల్లు ఆమె కోసం వెతుకుతుంటాడు. అయితే లిల్లీ ఓ మిషన్‌పై ఉంటుంది. అసలు..లిల్లీ మిషన్ ఏంటి? ఈ మిషన్‌లో ఇరుక్కున టిల్లు ఏం చేశాడు. దుబాయ్ నుంచి వస్తున్న హైదరా బాద్‌కు వస్తున్న క్రిమినల్‌కు, లిల్లీకి ఉన్న లింక్ ఏంటి? అన్నదే మిగిలిన కథ.
విశ్లేషణ
‘డిజేటిల్లు’ సినిమాను ఓ సారి గుర్తు తెచ్చుకుంటే….కథ, కథనం…ఈ విషయాలు ప్రేక్షకులు పట్టించు కోలేదు. టిల్లు క్యారెక్టర్‌ను ఏంజాయ్ చేశారు. ఆయా సందర్భాలానుసారంగా టిల్లు పాత్రతో వచ్చే కామెడీ, అతని డైలాగ్స్‌ను ఇష్టపడ్డారు. ఇదే ఫార్మాట్ సీక్వెల్ ‘టిల్లుస్క్వేర్’లోనూ ఫాలో అయ్యాడు సిద్దుజొన్నలగడ్డ. ఇక్కడ కూడా కథ, ట్విస్ట్‌లు వగైరా ఏం పెద్ద సర్ప్రైజ్లు, షాకింగ్‌లా ఉండవు. చెప్పాలంటే…‘డీజేటిల్లు’ సినిమాలోని సీన్స్ మళ్లీ రిపీట్ అవుతూ కొన్నిసార్లు విసిగిస్తాయి కూడా. లిప్‌లాక్స్, ఫైల్స్, డబుల్‌మీనింగ్ డైలాగ్స్ ఫ్యామిలీ ఆడియన్స్‌ను కాస్త ఇబ్బంది పెట్టొచ్చు. కానీ సింగిల్ వెళ్లిన ఆడియన్ ఏంజాయ్ చేస్తాడు.
DJ Tillu2 నాలుగో రిలీజ్ డేట్‌ను ప్రకటించిన డీజేటిల్లు
కానీ టిల్లు క్యారెక్టర్‌తో వచ్చే కామెడీ, ముఖ్యంగా వన్‌లైనర్స్ ఆడియన్స్‌ను నవ్విస్తాయి. తొలి పార్టులో నటిం చిన హారోయిన్ నేహాశెట్టి గెస్ట్ అప్పీరియన్స్ అదనపు ఆకర్షణగా ఉంటుంది. టైటిల్ సాంగ్ రీమిక్స్ ఒకే. సినిమా తక్కువ రన్ టైమ్ ఉండటం కూడా మరోప్లస్ పాయింట్. సినిమా అంతా సిద్దుపైనే నడుస్తోంది. రైటర్‌గాను సిద్దు మరోసారి నిరూపించుకున్నాడు. టిల్లు క్యారెక్టర్‌ను తాను అర్థం చేసుకున్నంత బాగా ఎవరూ అర్థం చేసుకోని ఉండరమో. అందుకే టిల్లు క్యారెక్టర్‌ను ఎప్పటికప్పుడు కొత్తగా…కాదు..ఆడియన్స్‌కు నచ్చేలా చేస్తున్నాడు సిద్దు జొన్నలగడ్డ.
నటీనటులు
Anupama Parameswaran: అనుపమ 2.ఓ…అభిమాని ఆవేదన
సిద్దు జొన్నలగడ్డ యాక్టింగ్ సూపర్. చెప్పాలంటే…సినిమా మొత్తాన్ని తన భుజస్కంధాలపైనే నడుస్తుంది అనే ఫీలింగ్ వస్తుంది ఆడియన్స్‌కు. అలా అని అనుపమాపరమేశ్వరన్ తక్కువగా చెప్పలేం. లిల్లీ పాత్రలోడిస్టెక్షన్లో పాసైపోయారు అనుపమాపరమేశ్వరన్. కానీ రెగ్యులర్ అనుపమా మాత్రం కాదు. రొమాంటిక్ డోస్ ఎక్కువగా ఉండదు.
Anupama Parameswaran: అనుపమ…అన్‌స్టాపబుల్!
టిల్లు ఫాదర్‌గా నటించిన మురళీధర్ గౌడ్‌కు మంచి రోల్ దక్కింది. కాస్తఫన్ కూడా ఉంటుంది డబుల్మీనింగ్స్లో. సీవీఎల్ నరసింహారావు, క్లబ్ ఓనర్ షానూన్గా ప్రిన్స్ సీసిల్పాత్రల మేరకు చేశారు. మురళీశర్మ, నెహాశెట్టి ఎక్స్టెండెడ్ కామియో రోల్స్‌లో కనిపిస్తారు. ఫస్టాఫ్‌లో రెండు, సెకండాఫ్‌లో రెండు పాటలు బాగున్నాయి. భీమ్స్ సంగీతం బాగుంది. ఎడిటర్‌గా నవీన్ బాగా చేశారు. నాగవంశీ, సాయిసౌజన్యల నిర్మాణ విలువలు బాగున్నాయి.