Siddharth- Aditi Marriage: హీరో సిద్దార్థ్, హీరోయిన్ అదితీరావ్హైదరీలు సీక్రెట్‌గా వివాహం చేసుకున్నారు. వనపర్తి జిల్లా శ్రీరంగాపూర్‌లోని రంగనాయకస్వామి దేవాలయంలో హిందూ సాంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నారు (Siddharth- Aditi Marriage). వీరి వివాహానికి కుటుంబసభ్యులు, బంధుమిత్రులు మాత్రమే హాజరైయ్యారు.ఈ సంఖ్యకూడా 40లోపే ఉంటుందని తెలిసింది.
వనపర్తిలోనే ఎందుకు?
వనపర్తి సంస్థానాధీశుల చివరి రాజు అయిన రాజారామేశ్వర్‌రావు పెద్ద కుమార్తె విద్యారావు ఏకైక కుమార్తె అదితీరావ్‌హైదరీ. అందుకే ఆమె వివాహం వనపర్తిలో జరిగింది. పైగా రంగనాయకస్వామి దేవాలయాన్ని అదితీరావ్ వంశపు పూర్వీకులు నిర్మించారు. దీంతో వనపర్తిలోని రంగనాయకస్వామి దేవాలయంలో సిద్దార్థ్, ఆదితీరావ్హైదరీల వివాహం జరిగింది.
సీక్రెట్ వివాహం!
సిద్దార్థ్, అదితీరావ్హైదరీలు సీక్రెట్ వివాహం చేసుకున్నారు. ఇక్కడ ట్విస్ట్‌లు కూడా ఉన్నాయి. అదితీరావ్ పూర్వీకులు కట్టించిన గుడి కాబట్టి, ప్రస్తుతం ఆలయంలోని పూజారులకు సినిమా పెళ్లి అని చెప్పి, గుడికిరావొద్దని చెప్పారు. దీంతో ఎవరూ రాలేదు. కానీ తమిళనాడు నుంచి పూజారులు వచ్చారు. సినిమా పెళ్లిపూజారులుగా వచ్చిన వీరు, నిజమైన పెళ్లి చేశారు. ఎప్పుడైతే వనపర్తి సంస్థానాధీశుల వారసులు ఈ వివాహానికి హాజరుకావడం ప్రారంభించారో సిద్దార్థ్, అదితీలది నిజమైన పెళ్లి అని తెలిసిపోయింది. వివాహంతర్వాత వనపర్తిలోని రాజావారి తోటలో సిద్దార్థ్, అదితీల వివాహపు విందుభోజనం ఏర్పాట్లు కూడా జరిగాయి. కానీ ఇక్కడ కూడా అతి కొద్దిమంది మాత్రమే హాజరు అయ్యారు.
Kalki2898ADPostponed: కల్కికి హిట్ సెంటిమెంట్ బ్రేకయినట్లేనా?
ఎప్పుడు ప్రేమలో పడ్డారు?
హిందీలో దాదాపు ఇరవైవరకు సినిమాలు చేసిన ఈ బ్యూటీ ‘సమ్మోహనం’ సినిమాతో తెలుగులోకి వచ్చా రు. ఆ తర్వాత ‘అంతరిక్షం’ సినిమా చేశారు. అయితే అజయ్‌భూపతి తీసిన ‘మహాసముద్రం’ సినిమాలో అదితీరావ్‌హైదరీ మెయిన్ హీరోయిన్గా నటించారు. ఈ చిత్రంలో హీరోగా శర్వానంద్ చేయగా, మరోలీడ్ రోల్లో సిద్దార్థ్ నటించారు. ఈ సినిమా చిత్రీకరణ సమయంలోనే సిద్దార్థ్, అదితీలు ప్రేమలో పడ్డారు.ఆ తర్వాత ఈ ఇద్దరు పలుసార్లు జంటగా రెస్టారెంట్స్, ఫంక్షన్స్‌కు హాజరైయ్యారు. ఆ సమయాల్లోనే ఈఇద్దరు వివాహం చేసుకుంటారని చాలా మంది ఊహించారు. ఆ ఊహే నిజమైంది.
అయితే సిద్దార్థ్, అదితీరావ్హైదరీల పెళ్లిని గురించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Thug Life: మణిరత్నంకు షాక్ ఇచ్చిన పొన్నియిన్ సెల్వన్
ఇద్దరికీ రెండో వివాహమే!
ఇటు సిద్దార్థ్, అటు అదితీ ఇద్దరికీ రెండో వివాహమే. 2003లో మేఘనను వివాహం చేసుకున్నారు సిద్దార్థ్. ఆ తర్వాత సిద్దార్థ్, మేఘన 2007లో విడాకులు తీసుకున్నారు. అలాగే తొలుత సత్యదీప్ మిశ్రాను వివాహం చేసుకున్న అదితీ, ఆ తర్వాత 2012లో విడాకులు తీసుకుంది.