Thug Life: మణిరత్నం తీసిన హిస్టారికల్ మూవీ ‘పొన్నియిన్ సెల్వన్’. తమిళ హీరో ‘జయం’ రవి టైటిల్ రోల్ చేశారు. ‘పొన్నియిన్ సెల్వన్’ సినిమా ‘జయం’రవి కెరీర్లో ఓ మైలురాయిలా ఉంటుందనడంలో సందేహాం లేదు. విక్రమ్, కార్తీ, ఐశ్వర్యారాయ్,త్రిష వంటి స్టార్స్ నటించిన సినిమాలో హీరోగా ‘జయం’ రవి చేశారు. పొన్నియిన్ సెల్వన్’లో. ఇది ‘జయం’ రవికి మణిరత్నం ఇచ్చిన గొప్ప చాన్స్ అనే చెప్పుకోవాలి. తాజాగా మణిరత్నం లేటెస్ట్ మూవీ ‘థగ్‌లైఫ్’(Thug Life) లోనూ ‘జయం’ రవికి చాన్స్ వచ్చింది. 37 సంవత్సరాల తర్వాత అంటే..నాయకన్ తర్వాత కమల్‌హాసన్‌తో మణిరత్నం చేస్తున్న పీరియాడికల్ యాక్షన్ చిత్రం ఇది. కానీ ఈ సినిమా నుంచి ఇప్పుడు ‘జయం’ రవి తప్పుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. కాల్షీట్స్ సర్దుబాటు చేయలేని కారణంగానే ‘జయం’ రవి ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారట. ఆల్రెడీ ఈ ప్రాజెక్ట్ నుంచి దుల్కర్ సల్మాన్ తప్పుకున్నాడు. ఇప్పుడు ‘జయం’ రవి కూడా తప్పుకోవడం ‘థగ్ లైఫ్’ను గురించి అందరు మాట్లాడుకునేలా చేస్తోంది.
ఈ సినిమా చిత్రీకరణ ఆల్రెడీ మొదలైంది. ఇపాటికి సెర్బియాలో చిత్రీకరణ ప్రారంభం కావా ల్సింది. కానీ వివిధ కారణాల వల్ల వాయిదా పడింది. ఈ షెడ్యూల్లోనే కమల్‌హాసన్, ‘జయం’ రవి కాంబినేషన్ సీన్స్ ఉన్నాయట. సెర్బియా షెడ్యూల్ వాయిదా పడటంతో డేట్స్ ఏడ్జెస్ట్ చేయలేక ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారట ‘జయం’ రవి. ఇంకా ఈ చిత్రంలో త్రిష, ఐశ్వర్యాలేక్ష్మీ, జోజు జార్జ్, గౌతమ్ కార్తీక్ కీలక పాత్రధారులు. ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.