సినిమా: లవ్‌గురు (LoveGuru Movie Review)
ప్రధాన తారాగణం: విజయ్ ఆంటోని, మృణాళిని రవి, యోగిబాబు, వీటీవీ గణేష్
దర్శకుడు: వినాయక్ వైథనాథన్
నిర్మాత–ఎడిటింగ్: విజయ్ ఆంటోని
సంగీతం: భరత్ ధనశేఖర్
కెమెరా: ఫరూక్ జే బాష.
జానర్: రొమాంటిక్కామెడీ అండ్ ఎమోషనల్ మూవీ (యూ బై ఏ సెన్సార్)
నిడివి: 2 గంటల 26 నిమిషాలు
విడుదల తేదీ: ఏప్రిల్ 11, 2024.
tollywoodhub.com Review Rating: 2.5/5
కథ
మూడుపదుల వయసు దాటినా ఇంకా వివాహం చేసుకోని అరవింద్ (విజయ్ ఆంటోని), వెంటనే పెళ్లి చేసుకోవాలనుకుని మలేషియా నుంచి ఇండియాకు వస్తాడు. ఓ చావు ఇంట్లో లీలా (మృణాళిని రవి) ను చూసి ఇష్టపడతాడు. అరవింద్ ఇష్టాన్ని గ్రహించిన అతని తల్లిదండ్రులు, లీలా కుటుంబసభ్యులతో పెళ్లి సంబంధం మాట్లాడతారు. లీలా సినిమాహీరోయిన్ కావడం ఏ మాత్రం ఇష్టంలేని ఆమె తండ్రి, లీలాకు అరవింద్‌తో పెళ్లి సంబంధం ఖరారు చేస్తాడు. అయితే పెళ్లిపీటలపైనే లీలాకు ఇష్టం లేని పెళ్లి చేశారని అరవింద్‌కు అర్థం అవుతుంది. జీవితంలో ఎలాగైన హీరోయిన్ అవ్వాలనుకుంటున్న లీలా లక్ష్యం నెరవేరిందా? అరవింద్ ప్రేమను లీలా అర్థం చేసుకుంటుందా? అరవింద్, లీలాలు ఎలా ఒక్కటవుతారు? అరవింద్ చిన్ననాటి జీవితంలో జరిగిన ఓ చేదు సంఘటన ఏమిటి? ఈ సంఘటనను తెలుసుకున్న లీలా ఏం చేసి అరవింద్‌కు హెల్ప్ చేసింది? అన్నది మిగిలిన కథాంశం
విశ్లేషణ
పెద్దల అంగీకారలతో హీరో, హీరోయిన్‌కి పెళ్లి జరగడం. వీరిలో ఎవరో ఒకరికి ఇష్టం లేకపోవడం. దీంతో ఇష్టం ఉన్న సర్దుకుపోవడం. క్లైమాక్స్‌లో ఇద్దరు ఏకమైపోవడం అనేది రోటీన్ మూవీ టెంప్లెట్. లవ్‌గురు సినిమా కూడా ఈ తరహాలోనేదే. అయితే ట్రీట్మెంట్ వేరు. భార్యభర్తల మధ్య పెద్ద సన్నివేశాలు ఉండవు. వీరి చుట్టు ఉండే పాత్రల ద్వారా వీరిని కలిపే ప్రయత్నం చేశాడు దర్శకుడు వైద్యనాథన్. అరవింద్– లీలాకు పెళ్లి జరగడం, ఈ దంపతులు ఇద్దరు హైదరాబాద్‌కు వచ్చి ఓ ఇల్లు తీసుకోవడం, అరవింద్ ఇంట్లోకి లీలా స్నేహితులు రావడం, లీలా హీరోయిన్గా నటించే సినిమాను అరవింద్‌యే నిర్మిస్తానడం, ఆపై తానే హీరో అనడం వంటి సన్నివేశాలతో తొలిభాగం చాలా ఫన్నీగా ముగుస్తుంది. ముఖ్యంగా విజయ్ ఆంటోనీ, వీటీవీ గణేష్‌ల మధ్య వచ్చే సన్నివేశాలు, విజయ్ ఆంటోనీ– యోగిబాబుల మధ్య వచ్చే కొన్ని సీన్స్ ఫన్నీగా ఉంటాయి.
Maidaan Review: అజయ్‌దేవగన్ మైదాన్ రివ్యూ
కానీ మలిభాగం మాత్రం ఫన్ ఉండదు. చాలా ఎమోషనల్‌గా ఉంటుంది. తన చెల్లిని అరవింద్ మిస్ కావ డం, ఈ సంఘటన వల్ల నిప్పు అంటే అరవింద్‌కు తీవ్రభయం కలగడం వంటి సీన్స్ ఆడియన్స్‌ను కాస్తసీరియస్టోన్లోకి తీసుకుని వెళ్తాయి. క్లైమాక్స్‌లో అరవింద్, లీలలా మధ్య సన్నివేశాలు ఎమోషనల్‌గా ఆకట్టుకుంటాయి.
భార్య ప్రేమను గెలుపొందేందుకు భర్త మరో వ్యక్తిలా మారడం లేదా మరో వ్యక్తిలా గొంతుమార్చి మాట్లాడ టం, ఆ విధంగా ఆమెకు దగ్గర కావడం అనే సినిమా కాన్సెప్ట్ చాలా పాతది. 2008లో షారుక్‌ఖాన్ ‘రబ్ నే బనా ది జోడీ’ సినిమా కాన్సెప్ట్ కూడా ఇదే. ‘లవ్‌గురు’ సినిమా ఈ సినిమాను ఓ సారి గుర్తుకు తెస్తుంది. కానీ ఫస్టాప్‌లో ఉన్న ఫన్ ‘లవ్‌గురు’ సినిమాకు ఫ్లస్‌పాయింట్. అలాగే కథలో హీరో పాత్ర పేరు అరవింద్, సినిమాలో తీసే సినిమా ‘లవ్‌గురు’లో హీరో పేరు విజయ్, భార్యకు మరో వ్యక్తిలా మాట్లాడే అరవింద్ మారు పేరు విక్రమ్. కొన్ని సంభాషణల్లో ఈ పేర్ల కన్ఫ్యూజన్ ఉండొచ్చు ఆడియన్స్‌కు. ఇంట్రవెల్, క్లైమాక్స్ సన్నివేశాలు ఆడియన్స్ ఊహించనట్లే ఉంటాయి. ఇక ‘బిచ్చగాడు’ సినిమాను మదర్ సెంటిమెంట్‌తో తీశాడు విజయ్‌ఆంటోని. ఈ సినిమా సూపర్‌హిట్. ఇకపోతే ఇటీవల ‘బిచ్చగాడు 2’ వచ్చింది. ఈ సినిమా కోర్ పాయింట్ సిస్టర్ సెంటిమెంట్. గత ఏడాది మేలో ‘బిచ్చగాడు 2’ వచ్చింది. ఇప్పుడు వెంటనే మళ్లీ సిస్టర్ సెంటిమెంట్ ఉండటం అనేది ‘లవ్‌గురు’కు ఉన్న మరో మైనస్ పాయింట్. అయితే ఇలాంటి లాజిక్‌లు పట్టించుకోని సాధారణ ఆడియన్స్‌కు, ఫ్యామిలీఆడియన్స్ను మాత్రం ‘లవ్ గురు’ మెప్పిస్తాడు. నవ్విస్తాడు. ఏడిపిస్తాడు. ఎంటర్టైన్ చేస్తాడు.
Manjummel Boys Telugu Review: మంజుమ్మల్ బాయ్స్ రివ్యూ
నటీనటుల పెర్ఫార్మెన్స్
అరవింద్ పాత్రలో విజయ్ ఆంటోనీ నటన సూపర్. కొత్త విజయ్ ఆంటోనిని చూస్తారు ఆడియన్స్. కామెడీ, ఎమోషనల్ సీన్స్‌లో బాగా చేశాడు. సెకండాఫ్‌లో అరవింద్‌గా తన భర్య లీలా దగ్గరకు వెళ్లి, విక్రమ్ గురించితెలుసుకునే ఓ ఫేక్ ప్రయత్నం చేసినప్పుడు విజయ్ ఆంటోని నటన ఫుల్ ఎమోషనల్‌గా ఉంటుంది. ఇక లీలాగా మృణాళిని నటన ఒకే. ఎక్కువ స్క్రీన్ ప్రెజెన్స్ ఉన్నా…నటనకు పెద్ద స్కోప్ ఉండదు. కానీ క్లైమాక్స్‌లో మెప్పిస్తుంది. విజయ్‌కు సలహాలు ఇచ్చే పాత్రలో యోగిబాబు, విజయ్‌ఆంటోని మామయ్యగా వీటీవీ గణేష్‌లకు మ«ంచి రోల్స్ పడ్డాయి. ఫన్ అంతా వీరి పాత్రలోనే వస్తుంది. కానీ వీరి పాత్రలు సెకండాఫ్లోసీరియస్గా మారిపోతాయి. విజయ్ ఆంటోని తల్లిదండ్రులుగా ఇళవరసు, సుధ వారి పాత్రల మేరకు చేశారు. హీరోయిన్ తండ్రిగా తలైవాసల్ విజయ్ పాత్ర కాస్త సీరియస్‌గా కనిపిస్తుంది. కానీ స్క్రీన్ ప్రెజెన్స్ చాలా తక్కువ. భరత్ ధనశేఖర్ సంగీతం, విజయ్ ఆంటోని ఎడిటింగ్, నిర్మాణ విలువలు బాగున్నాయి. ఫరూక్ జే బాష సినిమాటోగ్రఫీ ఒకే.