TollywoodHeroes: ఓ సినిమాకు టైటిల్ ఎంత ముఖ్యమో, ఫస్ట్‌లుక్‌లు, ప్రచార చిత్రాలు (వాల్ పోస్టర్స్, స్టాండింగ్ పిక్చర్స్) కూడా అంతే. సినిమా కొంత షూటింగ్‌ను పూర్తి చేసుకుని, టీజర్, ట్రైలర్ వచ్చేంత వరకూ ఆ సినిమా ప్రస్తావనకు ఫస్ట్లుక్కే ఆధారం. ఫస్ట్లుక్కే ఆ సినిమాకు గుర్తింపు. రీలీజ్ సమయంలో వాల్‌పోస్టర్స్ గట్రాలాంటివి. కానీ రీసెంట్‌టైమ్స్‌లో హీరోల చేతిలో సిగరేట్ లేనిదే ఫస్ట్‌లుక్, వాల్‌పోస్టర్స్ బయటకు రావడం లేదు. చేతిలో ఓ సిగరేట్టో, లేదా ఓ ఆయుధమో ఉంటే అది మాస్ ఫిల్మ్ అన్న కలరంగ్. ఈ ఏడాది ఈ తరహా లుక్‌లు మరింత ఎక్కువై, టాలీవుడ్ సిగరేట్ల కంపుకోడుతుంది.
సంక్రాంతికి వచ్చి సూపర్‌హిట్స్‌గా నిలిచిన చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’, బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’ చిత్రాల ఫస్ట్‌లుక్ పోస్టర్స్‌లో హీరోలు ధూమపానం చేస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తుంది. ‘ఏజెంట్’ కోసం అఖిల్.. ‘దసరా’ చిత్రం కోసం నాని..‘ఖుషి’ కోసం విజయ్‌దేవరకొండ..‘ఆదికేశవ’ మూవీ కోసం వైష్ణవ్‌తేజ్‌ల ధూమపానం పోస్టర్స్ బయటకు వచ్చాయి.
ఇక కెరీర్ స్టార్టింగ్ ధూమపానం విషయంలో సీరియస్‌గా ఉండే మహేశ్‌బాబు పదిహేను సంవత్సరాలుగా సిగరేట్ పొగకు దూరంగా ఉంటున్నారు. కానీ త్రివిక్రమ్ మహేశ్ చేతిలో సిగరేట్ పెట్టి వెలిగించేశాడు. అతడు, ఖలేజా చిత్రాల తర్వాత మహేశ్‌బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లోని సినిమా ఫస్ట్‌లుక్‌లో మహేశ్‌బాబు ధూమపానం చేస్తున్న సంగతి ప్రత్యేకించి చెప్పాలా.. పోస్టర్లో అంత స్పష్టంగా కనిపిస్తుంటే.
థియేటర్స్‌లో మూవీ స్టార్టింగ్‌లో ధూమపానం హానికరం అంటూనే సినిమాలో క్యారెక్టర్స్ అంటూ సిగరేట్ జ్యోతిని వెలిగించి…ఆ హీరోలు వారి ఫ్యాన్స్‌కు ఏం మేసేజ్ ఇస్తున్న ట్లు. అయినా మాస్ అంటే చేతిలో సిగరేట్ ఉండాల్సిందేనా..కథలో మాస్ మూమెంట్స్ ఉంటే సరిపోదంటారా? ఎమో..రైటర్స్ బ్లాక్ అంటూ దమ్ము కొట్టే స్క్రిప్ట్ రైటర్స్, దర్శకులనే అడగాలి మరి…!
Maheshbabu: ఇలా రావడానికి మహేశ్‌కు 16 సంవత్సరాలు పట్టింది