చిత్రం: కస్టడీ (Nagachaitanya Custody Review)
తారాగణం: నాగచైతన్య, అరవింద్‌స్వామి, ఆర్.శరత్‌కుమార్, ప్రియమణి, కృతీశెట్టి, సంపత్‌రాజ్
దర్శకుడు: వెంకట్‌ప్రభు
నిర్మాత: శ్రీనివాసా చిట్టూరి
కెమెరా: కదిర్
ఎడిటింగ్: వెంకట్ రాజన్
కథ
కేంద్రప్రభుత్వానికి వ్యతిరేకంగా స్థానికంగా సమైక్యత అనే రాజకీయపార్టీని స్థాపించిన తండ్రి, పెదనాన్నల వారసురాలిగా దాక్షాయిణి(ప్రియమణి) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యముంత్రిగా ఉంటుంది. అలా సీఎంగా దాక్షాయిణి కొనసాగుతున్న సమయంలో 1994లో రాజమండ్రి పరిసరప్రాంతాల్లోని మోరంపూడిలో పెద్ద బాంబ్ బ్లాస్ట్ జరిగి 40మంది చనిపోతారు. ఈ బాంబ్‌బ్లాస్ట్ యాధృశ్చికంగా జరిగిందా? లేక కుట్రలో కోణంగా ఓ ప్రణాళిక ప్రకారం ఎవరైనా చేశారా? అన్న కోణంలో కేంద్రదర్యాప్తు సంస్థ(సీబీఐ) పరిశోధన చేస్తుంటుంది. ఈ దర్యాప్తులో భాగంగా 1998లో సీబీఐ అధికారి జార్జీ(సంపత్‌రాజ్) చేతికి రౌడీషీటర్ రాజ శేఖర్ (అరవింద స్వామి) అలియాస్ రాజు దొరుకుతాడు? మరోరెండురోజుల్లో రాజశేఖర్‌ను బెంగళూ రులోని మెట్రోపాలిటన్ కోర్టులో సీబీఐ హాజరుపరచాలి. లేకపోతే దోషులు తప్పించుకుంటారు. కానీజార్జ్, రాజు ఎవరో తెలియకుండానే సఖినేటిపల్లిలో పోలీస్ కానిస్టేబుల్‌గా వర్క్ చేస్తున్న ఏ.శివ (నాగ చైతన్య) నైట్‌టైమ్‌లో అరెస్ట్ చేస్తాడు. ఆ తర్వాత రాజును బెంగళూరు కోర్టులో ప్రవేశపెట్టే బాధ్య శివపైఎందుకు పడుతుంది? ఈ క్రమంలో శివకు అతని ప్రేయసి రేవతి(కృతీశెట్టి) ఏ విధంగా అండగా నిలు
స్తుంది? కానిస్టేబుల్ శివ, సీబీఐ ఆఫీసర్ జార్జ్, రాజులను ఐజీ నటరాజన్ ఎందుకు చంపాలనుకుంటాడు? మోరంపూడిలో జరిగిన బాంబ్ బ్లాస్ట్‌కు దాక్షాయిణి, శివలకు సబంధం ఏమిటీ? అన్న ప్రశ్నలకు సమాధనమే ‘కస్టడీ’ కథ.
విశ్లేషణ
1994లో జరిగే మోరంపూడి బాంబ్బ్లాస్ట్తో కథ ప్రారంభమౌతుంది. రెండు నిమిషాల తర్వాత కథ 1998కి వెళ్తుంది. 13–6–1998 నుంచి 14–6–1998…ఈ రెండు రోజులు అంటే 48 గంటల్లో జరిగే కథ కస్టడీ. శివ, రేవతిల మధ్య ప్రేమ, వీరి పెళ్లి ప్రాబ్లమ్స్, ప్రేమ్ (వెన్నెల కిశోర్) కామెడీ, ఓ రెండు పాటలతో కంప్లీట్ నలభై నిమిషాలు గడిచిపోతాయి. ఇప్పటివరకు ప్రేక్షకులు సహానంగానే ఉండాలి. ఎప్పుడైతే రాజు, జార్,్జనటరాజన్ స్క్రీన్‌పైకి వస్తారో అప్పుడే అసలు కథ మొదలవుతుంది. రాజు,జార్జ్,శివ, రేవతిలు కలిసి ఉన్నఇంట్రవెల్ వాటర్సీన్ ఎపిసోడ్ బాగుంటుంది. ఇక సెకండాఫ్‌లో వచ్చే ప్లాష్‌బ్యాక్, ఫాదర్ ఎమోషన్ కథకు అంతగా యాప్ట్‌గా అనిపించవు. ఇవి అవసరం లేకపోయిన ఫర్లేదు అనిపిస్తుంది. కానీ కథనాన్ని ముందుకునడిపేందుకు దర్శకుడు చేసిన ప్రయత్నలోపాలుగా ఇవి ఉంటాయి. క్లైమాక్స్‌ను ఆడియన్స్ ముందే ఊహించవచ్చు. ఇది కూడా రోటీన్ క్లైమాక్స్. అయితే స్క్రీన్ ప్లే విషయంలో దర్శకుడి కాస్త మార్కులు వేయవచ్చు. కానీ కొన్ని రియలిస్ట్ యాక్షన్ సీక్వెన్స్‌లు ఒకే అనిపిస్తాయి. సినిమా అంత ఓ ప్రయాణంలా ఉంటుంది.
పెర్ఫార్మెన్స్
ఓ మధ్యతరగతి కుటుంబానికి చెందిన సాధారణ కానిస్టేబుల్ శివ నాగచైతన్య నటన ఒకే. కానీ కథల సె లక్షనే ఇంకాస్త మెరుగుపడాలి. ఇంట్రవెల్ సమయంలో వచ్చే వాటర్ ఎపిసోడ్, ప్రీ క్లైమాక్స్‌లో ట్రైన్ ఫైట్స్‌లో చైతూ కష్టం కనిపిస్తుంది. రేవతిగా కృతీశెట్టి పాత్రకు మంచి స్క్రీన్ ప్రజెన్స్ లభించింది. కానీ రేవతి పెర్ఫార్మెన్స్కు స్కోప్ ఉన్న కథ ఇది కాదు. రౌడీషీటర్ రాజుగా అరవింద్‌స్వామి, నటరాజన్‌గా శరత్‌కుమార్‌లకు మంచి పాత్రలు దొరికాయి. హీరో శివ పాత్రకు పోటాపోటీగా ఈ పాత్రలు ఉంటాయి. ఇక సర్ప్రైజింగ్రోల్స్లో కనిపించిన జీవ, ప్రేమ్‌జీ, వంటలక్క పాత్రలు కథకు ఒకే. ఇళయారాజా, యువన్ శంకర్రాజాలపాటలు ఈ సినిమాకు ప్లస్ కాలేకపోయాయి. ఆర్ఆర్ మాత్రం ఒకే.
బలాలు
నాగచైతన్య, అరవిందస్వామిల యాక్టింగ్
అండర్ వాటర్ ఎపిసోడ్
ట్రైన్ ఫైట్
బలహీనతలు
స్టార్టింగ్ సాగదీత సన్నివేశాలు
హీరో హీరోయిన్ల లవ్‌ట్రాక్
పాటలు
ప్లాష్‌బ్యాక్ ఎపిసోడ్
ఒక్కమాటలో…బాక్సాఫీస్ ‘కస్టడీ’ కాదు (2.50)