సినిమా: మ్యూజిక్‌స్కూల్ (Music School)
ప్రధాన నటీనటులు: శ్రియ, శర్మాన్ జోషి, షాన్, ప్రకాష్‌రాజ్
దర్శకుడు: పాపారావు బియ్యాల
నిర్మాణం: పాపారావు బియ్యాల, యామిని ఫిల్మ్స్
సంగీతం: ఇళయరాజా
కథ
హైదరాబాద్‌లోని సైబరాబాద్ హైటేక్ స్కూల్లో మనోజ్ (శర్మాన్ జోషి) డ్రామా టీచర్. గోవా నుంచి హైదరాబాద్‌కు ఈ స్కూల్లో టీచర్‌గా జాయిన్ అవుతారు మేరి(శ్రియ). మనోజ్, శ్రియ క్లాసలుకుస్కూల్ యాజమాన్యం పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వదు. దీంతో వారు నివాసం ఉంటున్న సరస్వతి అపార్ట్‌మెంట్స్‌లోనే మ్యూజిక్ స్కూల్‌ను స్టార్ట్ చేస్తారు మనోజ్ అండ్ మేరి. ఈ విషయం తెలుసుకున్నఅపార్ట్మెంట్స్లోని పిల్లలు కొందరు ఈ మ్యూజిక్ స్కూల్లో జాయిన్ అవుతారు. మ్యూజిక్, డ్రామాఈ రెండు అంశాలు కలిసి ఉండేలా ‘సౌండ్ ఆఫ్ మ్యూజిక్’ అనే స్టేజ్ డ్రామా ప్రదర్శనను ఇవ్వాలను కుంటారు మనోజ్, మేరి అండ్ పిల్లలు. రిహార్సల్స్ సరిగా సాగకపోవడంతో మేరి స్వస్థలం అయిన ఓగోవాలో మూడువారాలు రిహార్సల్స్ చేసి, తిరిగి హైదరాబాద్‌కు వచ్చి ‘సౌండ్ ఆఫ్ మ్యూజిక్’ ప్రదర్శన ఇవ్వాలనుకుంటారు. కానీ ఇక్కడ కూడ వారు ఎదుర్కొన్న సమస్యలు ఏమిటి? ‘సౌండ్ ఆఫ్ మ్యూజిక్’ప్లే ఎలా ప్రదర్శించబడింది? అన్నదే కథ.
విశ్లేషణ
తెలుగువారికి మ్యూజిక్ అనగానే భరతనాట్యం, కూచిపూడి, కర్ణాటిక్, హిందూస్తానీ సంగీతాలు గుర్తుకు వస్తాయి. వీటిని ఆశించి ఈ సినిమాను చూసేందుకు వెళితే మాత్రం ఆడియన్స్ తప్పులో కాలేసినట్లే. ఇది కంప్లీట్‌గా వెస్ట్రన్ మ్యూజిక్ స్కూల్. కేవలం చదువు మాత్రమే ముఖ్యం కాదు…పిల్లలకు ఫైన్ఆర్ట్స్లోనూ ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతోఈ సినిమాను తెరకెక్కించిన్నట్లుగా మాజీ ఐఏఎస్ ఆఫీసర్, ఈ సినిమాతో దర్శకుడిగా మారిన పాపారావు బియ్యాల చెప్పుకొచ్చారు. కానీ ఆయన మాటలు స్క్రీన్‌పైకి అంతగా రాలేదనే చెప్పవచ్చు. కొందరు పిల్లలు చదువుతో పాటు ఫైన్ఆర్ట్స్లో కూడా ప్రావీణ్యం ఉంటుందనే పాయింట్‌తో కథ మొదలైన ఇది సరిగ్గా ఎస్టాబ్లిష్ కాలేదు. ఇక కథ ఎప్పుడైతే గోవాకు షిఫ్ట్ అయ్యిందో అక్కడేట్రాక్ తప్పింది. ‘సౌండ్ ఆఫ్ మ్యూజిక్’ రిహార్సల్స్‌ను పక్కన పెట్టిన దర్శకుడు, మేరి, ఆల్భర్ట్(షాన్)ల లవ్‌స్టోరీ, మరీ ముఖ్యంగా టీనేజ్ పిల్లలు రెంచల్, సంయుక్తాల లవ్‌స్టోరీపై ఫోకస్ పెట్టినట్లు అనిపిస్తుంది. ప్రీ క్లైమాక్స్‌లో మ్యూజిక్ జానర్ కాస్త పోలీసుల రంగప్రవేశంతో క్రైమ్ జానర్లోకి వెళ్లిపోతుంది. ఇక క్లైమాక్స్‌లో వచ్చే వెస్ట్రన్ సౌండ్ ఆఫ్ మ్యూజిక్ కూడా తెలుగు ప్రేక్షకులకు అయితే కాస్త అర్ధం కాదు. ఇవే కాకుండ సినిమాలోని ఉన్న మరికొన్ని సన్నివేశాలకు దర్శకుడికి ఇదే తొలి సినిమా అని గుర్తుచేస్తుంటాయి. తొలిభాగంలో వచ్చే సాంగ్స్ బాగుంటాయి.
నటీనటుల తీరు
నటన పరంగా శ్రియ పెద్దగా చేసేది ఏం లేకపోయిన డ్యాన్స్ పాటల్లో ఆమె అభినయం ఆకట్టుకుంటుంది. శర్మాన్‌జోషి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేరు. కానీ ఆయన నటన ఒకే అనిపిస్తుంది. సింగర్షాన్, ప్రకాష్‌రాజ్ పాత్రలు పరిధిమేర పర్వాలేదనిపిస్తాయి. కానీ సీనియర్ నటి కాంచన పాత్ర శైలి బాగుటుంది. శ్రీకాంత్ అయ్యంగార్ పాత్ర స్క్రీన్‌పైకి వచ్చినప్పుడు కాస్త నివ్వించినా, ఆయన అన్నీ సీన్స్ కనీసంఐదు నిమిషాలు కూడ ఉండవు. ఇక ఈ సినిమాలో చెప్పుకోవాల్సింది ఏమైనా ఉందంటే అది ఇళయారాజాగారి సంగీతమే. సినిమాలో ఉన్న పదకొండు పాటల్లో తొమ్మిదిపాటలు ఆయన స్వరపరచినవే. మాటలే పల్లవులుగా వచ్చిన ఈ సినిమాలోని పాటలు కాస్త గమ్మత్తుగా ఉంటాయి. అవి కూడా తొలిభాగంలోనే.
బలాలు
శ్రియ డ్యాన్సింగ్ స్కిల్స్
ఇళయరాజా మ్యూజిక్
బలహీనతలు
అవసరంలేని లవ్‌ట్రాక్‌లు
తెలుగువారికి వెస్ట్రన్ మ్యూజిక్ పాఠం