Laapataaladies: కథ: 2001లో జరిగే కథ ఇది. సూరజ్ముఖి వాస్తవ్యుడు దీపక్ కుమార్‌తో గంగాపూర్‌కు చెందిన ఫూల్ కుమారి వివాహం జరుగుతుంది. అంబారీ విలేజ్‌కి చెందిన జయాదేవి వివాహం పాటియాల వాస్తవ్యుడు ప్రదీప్‌సింగ్‌తో జరుగుతుంది. దీపక్–ఫూల్, ప్రదీప్‌సింగ్– జయాదేవిల జంటలు ఓ ట్రైన్లో ప్రయాణంచేస్తుంటారు. ఫూల్, జయాదేవిలు మేలిముసుగును ధరిస్తారు. వీరి తరహాలోనే మరికొందరు వధూవరులు కూడా ఇదే ట్రైన్లో ఉంటారు. అర్థరాత్రి మార్తి రైల్వేస్టేషన్ రాగానే మేలిముగుసులో ఉన్న జయాదేవినితన భార్యగా ఫూల్ అనుకుని, దీపక్ ఆమెను సూరజ్ముఖికి తీసుకొస్తాడు. సూరజ్ముఖికి వచ్చిన తర్వాతజయాదేవి తన పేరు పుష్పరాణి అని, తన భర్త పేరు పంకజ్ అని దీపక్ చేసిన పొరపాటు వల్లే తాను ఇక్కడికి రావాల్సి వచ్చిందని చెబుతుంది. మరోవైపు పాటియాలా రైల్వేస్టేషన్ రాగానే…ఫూల్కుమారిని తన భార్యగా భావించి ట్రైన్ దిగమంటాడు ప్రదీప్. కానీ మేలిముగుసు తొలగించిన తర్వాత ఫూల్కుమారితన భార్య జయ కాదని తెలుస్తోంది. ప్రదీప్ ఆమెను తన వెంట తీసుకుని వెళ్లడు. అలాగే ఫూల్కుమారి కూడా తన వెంట వెళ్లకుండ, తన భర్త దీపిక్ వచ్చి తీసుకువెళ్తాడని పాటియాలా రైల్వే స్టేషన్లోనే నిరీక్షిస్తూ ఉంటుంది.
మరి..జయాదేవి తన పేరు, భర్త పేరును ఎందుకు తప్పుగా చెప్పింది? పోలీసులు జయాదేవిని ఎందుకు అరెస్ట్ చేస్తారు? దీపక్–ఫూల్ జంటను కలిపేందుకు జయాదేవి చేసిన పనులు ఏమిటి? అసలు జయాదేవి ఎవరు? అన్నది సినిమాలో ఆసక్తికరంగా, ఎమోషనల్‌గా ఉంటుంది.
మహిళలు స్వేచ్ఛ, వారి నిర్ణయాలు – అభిప్రాయాలను గౌరవించడం, మహిళా సాధికారిత వంటి అంశాలను ఈ సినిమాలో చూపించారు దర్శకురాలు కిరణ్‌రావు. జయాదేవి, ఫూల్కుమారిలు ట్రైన్లో మిస్‌ప్లేస్ అయ్యే సంఘటనతో ఈ సినిమా కథ మొదలవుతుంది. ఫస్టాఫ్‌లో ఎక్కువగా జయాదేవిగురించే ఉంటుంది. ఫూల్కుమారిని వెతికి పెట్టాలని దీపక్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడం, పోలీసుల ఇన్వేస్టిగేషన్, పాటియాల రైల్వేస్టేషన్లో భర్త కోసం ఎదురుచూస్తూ రైల్వేప్లాట్ఫామ్పై ఉన్న ఓబడ్డీ కొట్టుతో పని చేసుకోసుకోవడం, ఆమెకు మరికొంతమంది ఆసరా ఇవ్వడం వంటి సీన్స్తోఉంటుంది. కొన్ని ఫన్నీ సీన్స్ ఉంటాయి.
MaharajaReview: విజయ్‌సేతుపతి మహారాజ రివ్యూ
సెకండాఫ్‌లో ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి. జయాదేవితో క్లైమాక్స్‌లో పోలీస్‌స్టేషన్‌లో వచ్చే సన్నివేశాలు ఎమోషనల్‌గా అనిపిస్తాయి. జయాదేవి బ్యాక్ స్టోరీ అమ్మాయిల్లో స్ఫూర్తి నింపేలా ఉంటుంది. అత్తంటికి, పుట్టినింటికి వెళ్లలేక పూల్ పడిన బాధ,ఆమె నమ్మకం, ధృఢసంకల్పం బాగున్నాయనిపిస్తుంది. చదువుకోవాలనుకునే అమ్మాయిగా జయాదేవి తీసుకుంటున్న నిర్ణయాలు ఆడియన్స్‌ను ఆలోచించేలా చేస్తాయి. బిప్లక్ గోస్వామి కథకు స్నేహా దేశాయ్ మంచి స్క్రీన్ ప్లే అందించారు.
ఫూల్ కుమారిగా నితాన్షి గోయోల్ భలేగా నటించారు. ఎమోషనల్ సీన్స్‌లో బాగా యాక్ట్ చేశారు. తనకు ఆశ్రయం ఇచ్చిన మంజుమాయి బడ్డీ కొట్టులో స్వీట్ చేయడం, భర్త వచ్చి తీసుకెళ్తాడని ఓ నమ్మకంతో ఉండటం వంటివి బాగుంటాయి. జయా దేవి అలియాస్ పుష్పరాణి ఆలియాస్ శ్రేయ పాత్రధారిగా నటించిన ప్రతిభారంతా యాక్టింగ్‌లో అదరగొట్టారు. పోలీస్‌స్టేషన్స్‌లో వచ్చే సన్నివేశాలు, ఇంట్లో గొడవపడే తీరు, దీపక్ ఇంట్లోవారితో ఆమె కలిసిపోయే సీన్స్ బాగుంటాయి. ఈ సన్నివేశాల్లో ఆమె యాక్టింగ్ అదుర్స్ అనే చెప్పాలి.
tollywood:ప్రీ ప్రొడక్షన్స్‌లోనే ఫ్లాప్!
ఇన్స్పెక్టర్ శ్యామ్ మనోహర్‌గా రవికిషన్ మరో మంచి పాత్ర చేశారు. ప్రీ క్లైమాక్స్‌లో రవికిషన్ యాక్టింగ్ ఏంటో మరోసారి చూస్తారు ఆడియన్స్. దీపక్‌కుమార్‌గా స్పర్శ్ శ్రీవాస్తవ్, మంజుభాయిగా ఛాయాకందమ్, ప్రదీప్‌గా భాస్కర్ ఝా వారి పాత్రల మేరకు యాక్ట్ చేశారు. ఈ సినిమాకురామ్ సంపత్ అందించిన మ్యూజిక్ కూడా మరో ఫ్లస్‌పాయింట్. వికాష్ ఛాయాగ్రహణం ఒకే. పీరియాడికల్ డ్రామా, కథను బట్టి ఉన్నంతో నిర్మాతలు కిరణ్‌రావు, ఆమీర్ఖాన్లు బాగానే నిర్మించారు.