కథ
MaharajaReview: మహారాజ (విజయ్‌సేతుపతి Vijaysethupathi) ఓ బార్బర్. ఆయన కుమార్తె జ్యోతి (సచన నేమిదాస్). మహారాజ ఓ రోజు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తన ఇంట్లోని లక్ష్మి కనపడటం లేదని ఫిర్యాదు చేస్తాడు. ముగ్గురు దొంగలు వచ్చి లక్ష్మిని ఎత్తుకెళ్లిపోయారనిపోలీసులకు మహారాజ చెబుతాడు. లక్ష్మి అంటే తన ఇంట్లోని ఇనుప చెత్తబుట్ట అని చెబుతాడు మహారాజ. దీంతో పోలీసులకు కోపం వస్తుంది. ఓ చెత్తబుట్ట కోసం పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఎఫ్ఐఆర్ నమోదు చేయమని అడగటంతో మహారాజను పోలీస్‌స్టేషన్ నుంచి బలవంతంగా బటయకు పంపిస్తారు పోలీసులు. అయితే లక్ష్మిని కనిపెట్టి తీసుకోస్తే ఐదు లక్షలు ఇస్తానని పోలీస్ వరదరాజన్‌తో బేరం కుదుర్చుకుంటాడు మహా రాజ. ఓ చెత్తబుట్ట కోసం మహారాజ ఐదు లక్షలు ఇస్తాననడం పోలీసులకు ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది. ఈ చెత్త బుట్టలో ఏదో పెద్ద మొత్తం ఉంటుందని భావించిన పోలీసులు, ఆ చెత్తబుట్టను వెతకడం ప్రారంభి స్తారు. మరి..లక్ష్మి నిజంగా దొరికిందా? లక్ష్మి వెనక ఉన్న నిజమైన స్టోరీ ఏంటి? మహారాజను సెల్వం (అనురాగ్ కశ్యప్) ఎందుకు చంపాలనుకుంటాడు? జ్యోతికి సెల్వంకు ఉన్న అనుబంధం ఏమిటి? అన్నది ఈ సినిమా మిగిలిన కథ (MaharajaReview).
ఓ పర్ఫెక్ట్ రివెంజ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీగా మహారాజను చెప్పుకోవచ్చు. మహారాజ యంగ్‌గా ఉన్నప్పుడు జరిగిన ఓ పెద్ద యాక్సిడెంట్‌తో కథ మొదలవుతుంది. సడన్‌గా మహారాజ, అతని కుమార్తె జ్యోతిల సీన్స్తోసినిమా సాగుతుంది. పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ‘లక్ష్మి’ గురించి మహారాజ కంప్లెంట్ ఇవ్వడం, కథలోని సెల్వం,ధన, నట్టి, జ్యోతి పాత్రల పరిచయాలతో సీన్స్‌లతో తొలిభాగం గడుస్తుంది. కానీ ఇంట్రవెల్లో ధనను మహారాజ చంపే ఫైట్ సీన్స్ హై ఇస్తుంది ఆడియన్స్‌కు. మంచి మాస్ ఎలివేషన్ ఫైట్ ఉంటుంది కథలో.అలాగే పోలీస్‌స్టేషన్‌లో లక్ష్మి గురించి మహారాజ కంప్లేట్ చేసిన సీన్స్‌లో కొంత కామెడీ ఉంటుంది. సెకం డాఫ్‌లో సెల్వం స్టోరీ ఉంటుంది. అయితే ఎప్పుడైతే అసలు లక్ష్మికి బదులుగా, ఓ నకలీ లక్ష్మిని తయారు చేసి, మహారాజకు పోలీసులు ఇవ్వాలను కుంటారో అప్పట్నుంచి స్టోరీ వేగం పుంజుకుంటుంది. మహారాజ ఎందుకు లక్ష్మి కోసం వెతుకుతు న్నాడన్న స్టోరీ తెలియగానే ఆడియన్స్ షాక్ అవుతారు. ఈ క్రమంలో వచ్చే ట్విస్ట్‌లు, కథలో మలుపులు సినిమా పట్ల ఆడియన్స్‌ను అలా కట్టిపడేస్తాయి. జ్యోతికి, సెల్వంకు ఉన్న సం బంధం స్క్రీన్‌పై కనిపించినప్పుడు ఎమోషన్‌కు లోనవుతారు. క్లైమాక్స్‌లో సెల్వంతో జ్యోతి చెప్పే డైలాగ్స్
అయితే ఆడియన్స్‌కు హై ఇస్తాయి. ఓ టీనేజ్ అమ్మాయి అలా మాట్లాడిన తీరు ప్రేక్షకులకు స్ఫూర్తిదాయకంగా ఉంటాయి.
కానీ కథను దర్శకుడు నితిలిన్ నాన్–లీనియర్ స్క్రీన్ ప్లే విధానంలో చెప్పాడు. ఇదే సినిమాకు ఫ్లస్, మైనస్సూ. చూస్తున్నది ప్రస్తుత కథా లేకపోతే గతంలో జరిగిన కథనా అన్న డౌట్ ఆడియన్స్‌కు వస్తూ ఉంటుంది. ఓ సగటు ప్రేక్షకుడు మాత్రం మహారాజ సినిమాను చూసినప్పుడు కాస్త కన్ఫ్యూజ్ అవుతాడు. ప్యారలల్ స్క్రీన్ ప్లే అర్థమయ్యేందుకు దర్శకుడు చేసిన ప్రయత్నం బాగుంది. కానీ ఇది ఎంతమంది ఆడియన్స్‌కు రీచ్ అవుతుందనేది చెప్పలేం. కానీ ఓ చెత్తబుట్టతో సినిమాలోని అన్ని క్యారెక్టర్స్‌ను కనెక్ట్ చేసిన దర్శకుడు తీరును మెచ్చుకోవాల్సిందే. ఫాదర్–డాటర్ల ఎమోషన్ కూడా అద్భుతంగా ఉంటుంది. ఓ సెన్సి టివ్ సబ్జెక్ట్‌ను దర్శకుడు డీల్ చేసిన విధానం కూడా ఒకే.
మహారాజ పాత్రలో విజయ్‌సేతుపతి అద్భుతంగా నటించాడు. తన కళ్లముందే యాక్సిడెంట్ జరిగినప్పుడు మహారాజ ఎక్స్ప్రెషన్స్, పోలీస్స్టేషనల్లో అమాయకుడిలా కంప్లైట్ ఇవ్వడంలో ఎమోషన్–కామెడీ, ధన ను చంపడంలో మాస్ ఎలివేషన్…ఇలా ప్రతిసీన్లో విజయ్‌సేతుపతి విలక్షణ కనిపిస్తుంది.
ఇక టీనేజ్ అమ్మాయిగా సచిన యాక్టింగ్ ఒకే. నేరాలు చేసైన కూతురికి ఓ మంచి జీవితం ఇవ్వాలనుకునే తండ్రి సెల్వంపాత్రలో అనురాగ్ కశ్యప్ అదరగొట్టాడు. పోలీసాఫీసర్‌గా నట్టికి మంచి రోల్ పడింది. ఈ పాత్ర సినిమా అంతా ఉంటుంది. మమతామోహన్దాస్కు స్క్రీన్ ప్రజెన్స్ మాత్రమే ఉంటుంది.పెద్ద ఇంపార్టెన్స్ లేదు. సెల్వం భార్యగా అభిరామి పాత్రకు ఉన్న స్క్రీన్ టైమ్ కూడా తక్కువే. విజయ్‌సేతుపతికి సపోర్ట్‌గా ఉండే భారతీరాజా పాత్రకి కథలో ఇంపార్టెన్స్ లేదు. విలన్లో ఒకరు ధనగా బాయ్స్ మణి కందన్, పోలీసులుగా అరుల్దాస్, మునిస్కందన్ వారి పాత్రల మేరకు నటించారు. కానీ పోలీస్ ఇన్ఫార్మర్ నల్ల శివగా సింగం పులికి మంచి రోల్ పడింది. ముఖ్యంగా సెకండాఫ్‌లో ఇతని పాత్ర కీలకంగా కనిపి స్తుంది.
సుధన్ సుందరం, జగదీష్ పళని స్వామిల నిర్మాణ విలువలు బాగున్నాయి. దినేష్ పురుషోత్తమన్ విజువల్స్ ఒకే. ఇక ‘కాంతార’ ఫేమ్ అజనీష్ లోకనాథ్ ఇచ్చిన బ్యాగ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకు మరో ఫ్లస్పాయింట్గా ఉంటుంది.