HaromHara: కథ: కుప్పంలోని ఓ పాలిటెక్నిక్ కాలేజీలలో మెకానికల్ ల్యాబ్ అసిస్టెంట్ సుబ్రహ్మణ్యం (సుధీర్‌బాబు). అక్కడి రౌడీలుగా అరచకాలు చేస్తుంటారు తమ్మిరెడ్డి(కేజీఎఫ్ లక్కీ లక్ష్మణ్), బసవ రెడ్డి ( రవి కాలె). తమ్మిరెడ్డి తనయుడు శరత్‌రెడ్డి (అర్జున్ గౌడ) కూడా వీరిలానే అక్రమాలు చేస్తుంటాడు. కాలేజీలో ఓ సారిశరత్రెడ్డి అనుచరులను సుబ్రహ్మణ్యం కొడతాడు. దీంతో ఉద్యోగం పోతుంది? చేసేది ఏం లేక ఇంటికి వెళ్తాడు. అక్కడ సుబ్రహ్మణ్యం తండ్రి శివారెడ్డి(జయప్రకాష్) అప్పులు చేస్తాడు. దీంతో సుబ్రహ్మణ్యంకుడబ్బులు అవసరం అవుతాయి. దీంతో మళ్లీ కుప్పం వచ్చి పళని (సస్పెండెడ్ పోలీస్ కానిస్టేబుల్)తో కలిసి గన్మేకింగ్ వ్యాపారం స్టార్ట్ చేస్తాడు. గన్స్ తయారు చేసి శరత్‌రెడ్డి మనుషులకు అమ్ముతాడు. అయితే ఓసారి శివారెడ్డిని శరత్‌రెడ్డి చంపబోతాడు. తండ్రిని కాపాడుకుంటాడు సుబ్రహ్మణ్యం. దీంతో శరత్‌రెడ్డి వర్గంవారికి, సుబ్రహ్మణ్యంకు వార్ మొదలవుతుంది. ఈ పోటీలో ఎవరు గెలిచారు? అసలు…శివారెడ్డిని తమ్మిరెడ్డి వర్గం ఎందుకు చంపాలనుకుంది? సుబ్రహ్మణ్యంతో దేవి(మాళవికా శర్మ) ప్రేమకథ ఎలా ముగిసింది? అన్నదే మిగిలిన కథ (HaromHara)
Kalki2898ad: కల్కి2898 ఏడీ ట్రైలర్ ..షాక్‌లో ప్రభాస్!
ఓ సాధరణ కుర్రాడు జీవితం కోసమో, జీతం కోసమో మరో ఊరు రావడం. అక్కడి రౌడీలతో గొడపడి ప్రజల దృష్టిలో హీరో కావడం. ఆ తర్వాత ఈ హీరోకు పోలీసుల నుంచి సమస్యలు వచ్చి, తగ్గడం. ఈ క్రమంలో సొంత మనుషులకు కోల్పోవడం. ఆ తర్వాత ఎమోషనల్ అయ్యి ఆ హీరో విలన్స్ అందరినీచంపడం…ఇది తెలుగు సినిమా పక్కా కమర్షియల్ టెంప్లెట్. దీనికి ఇటీవల వచ్చిన ‘పుష్ప’ సినిమా ఓ ఉదాహరణ.
‘హరోంహర’ సినిమా దర్శకుడు జ్ఞానసాగర్ ద్వారకా కూడా ఇదే ఫాలో అయ్యాడు. కానీ డ్రామాను తక్కువ చేసి యాక్షన్, హీరో ఎలివేషన్స్‌పైనే ఎక్కువ దృష్టి పెట్టాడు. కథలో కొత్తగా చెప్పుకోవాల్సింది ఏమీ లేదు. కుప్పం వచ్చిన హీరో ప్రజలదృష్టిలో హీరో కావడంతో తొలిభాగం ముగుస్తుంది. ఇంట్రవెల్ తర్వాత విలన్స్‌ను చంపడంతో సినిమా ముగుస్తుంది అంతే. గన్మేకింగ్ని తయారు చేసే విజువల్స్, గన్స్ అక్రమ రవణా, పోలీసుల ప్రయత్నాలు ఇవన్నీ రోటిన్ సన్నివేశాలే. సినిమాలో ఎమైనా చెప్పుకోవాల్సింది ఉంది అంటే యాక్షన్ బ్లాక్స్. ఈ సినిమాలోని యాక్షన్ సన్నివేశాలు బాగుంటాయి. హీరో ఎలివేషన్స్ థియేటర్స్‌లో ఆడియన్స్‌కు హై ఇస్తాయి. హీరోయిన్‌తో లవ్ ట్రాక్ పరమ రోటీన్. దర్శకుడు జ్ఞానసాగర్ చెప్పిన మైథ లాజికల్ ఎలిమెంట్స్ కూడా కనెక్ట్ కావు.
MaharajaReview: విజయ్‌సేతుపతి మహారాజ రివ్యూ
సుబ్రహ్మణ్యంగా సుధీర్‌బాబు నటన కొత్తగా ఏమీ లేదు కానీ బాగుంది. యాక్టింగ్ కన్నా కూడా సుధీర్‌బాబు పడిన కష్టం తెరపైక కనిపిస్తోంది. కుప్పం యాసను పలకడంతో సుధీర్‌బాబు సక్సెస్ అయ్యారనే చెప్పాలి. హీరోయిన్గా మాళవికా శర్మ, పోలీసాఫీసర్‌గా అక్షర గౌడ పాత్రలకు కథలో అంత ఇంపార్టెన్స్ లేదు. రౌడీలు తమ్మిరెడ్డిగా లక్ష్మణ్, బసవగా రవి కాలె, శరత్‌గా అర్జున్ గౌడలు విలన్స్‌గా మాములు తరహా పాత్రలే చేశారు. అర్జున్ గౌడ పాత్ర అయితే సెకండాఫ్ అంతా కోమాలోనే ఉంటుంది.కానీ పళని పాత్రలో సునీల్‌కు మంచి క్యారెక్టర్ పడింది. సస్పెండెడ్ పోలీస్‌కానిస్టేబుల్‌గా సునీల్ పాత్ర సినిమా అంతా ఉంటుంది. హీరోకు ఒకట్రెండు ఎలివేషన్స్ ఈ పాత్ర నుంచే వస్తాయి. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. ఖర్చుపెట్టింది స్క్రీన్‌పై కనిపిస్తుంది. సుధీర్‌బాబు, సునీల్‌ల పెర్ఫార్మెన్స్ల తర్వాత సినిమాలో చెప్పు కోవాల్సిన మరో ముఖ్యమైన పాయింట్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్. చైతన్ భరద్వాజ్ ఆర్ఆర్ ఈ సినిమాను చాలా చోట్ల నెలబెట్టింది. కొత్త మ్యూజిక్ విన్నట్లు ఉంటుంది. అరవింద్ విశ్వనాథన్ సినిమాటోగ్రఫీ ఒకే. ఎడిటర్ రవితేజ ఇంకాస్త ఎడిట్ చేసే అవకావం సినిమాలో ఉంది.
హరోంహర: యాక్షన్ ఎక్కువ..డ్రామా తక్కువ (2/5)