Allari Naresh Ugram Review: వరుస వైఫల్యాల తర్వాత ‘అల్లరి’ నరేశ్‌కు ‘నాంది’ సినిమాతో హిట్ ఇచ్చారు దర్శకుడు విజయ్ కనక మేడల. మళ్లీ ఈ ఇద్దరు కాంబినేషన్లో వస్తున్న తాజా చిత్రం ‘ఉగ్రం’. ఓ సామాజిక అంశానికి ఫ్యామిలీఎమోషన్స్, ఫుల్ యాక్షన్ జోడించి ‘ఉగ్రం’ సినిమాను తీశారు. మరి..ఉగ్రం సినిమా విజయం సాధించిందా? రివ్యూలో చదవండి.
సినిమా: ఉగ్రం
ప్రధాన తారాగణం: ‘అల్లరి’ నరేశ్, మిర్నా మీనన్
నిర్మాతలు: సాహుగారపాటి, హరీష్ పెద్ది
దర్శకుడు: విజయ్ కనకమేడల
కథ: తూము వెంకట్
డైలాగ్స్: అబ్బూరి రవి
కెమెరా: సిద్
సంగీతం: శ్రీచరణ్ పాకాల
కథ
పోలీసాఫీసర్ శివకుమార్ (‘అల్లరి’ నరేశ్), అపర్ణ (మిర్నా మీనన్) ప్రేమవివాహం చేసుకుంటారు. సీన్సియర్ పోలీసాఫీసర్ అయిన శివకుమార్ ఎక్కువగా డ్యూటీకే సమయం కేటాయిస్తుంటాడు. ఈక్రమంలో ఓ గురుకుల పాఠశాలలో విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించే ఓ గంజాయి ముఠానుఅరెస్ట్ చేస్తాడు శివకుమార్. అయితే కుటుంబాన్ని పట్టించుకోకుండ డ్యూటీకే ఎక్కువ సమయం కేటా యిస్తున్న శివ ప్రవర్తన పట్ల విసిగిపోయిన అపర్ణ భర్తను విడిచి తిరిగి పుట్టింటికి వెళ్లాలనుకుంటుంది.ఐదేళ్ల తర్వాత తన తండ్రికి ఫోన్ చేస్తుంది. అయితే అపర్ణను పుట్టింటికి తానే తీసుకుని రాత్రివేళ బయలు దేరతాడు శివకుమార్. ఈ ప్రయాణంలో రోడ్డు ప్రమాదం జరుగుతుంది. భార్య అపర్ణ, కుమార్తె లక్కీ(ఊహా)లను హాస్పిటల్‌కు తీసుకుని వెళతాడు శివకుమార్. కానీ హాస్పిటల్లో అపర్ణ, లక్కీలు ఉండరు.అయితే ఈ యాక్సిడెంట్లో సమయంలో శివకుమార్ డెమ్నిషియా(లేనిది ఉన్నటుగా ఊహించుకోవడం)కు గురి అవుతాడు. దీంతో అపర్ణ, లక్కీలను హాస్పిటల్‌కు తీసుకురాకుండానే తీసుకు వచ్చి ఆడ్మిట్ చేసినట్లుగా శివకుమార్ భావిస్తాడు. మరి..అపర్ణ, లక్కీలు ఏమైనట్లు? శివకుమార్ అరెస్ట్ చేసిన గంజాయి
ముఠాకు ఈ యాక్సిడెంట్‌కు ఏమైనా సంబంధం ఉందా? భార్య అపర్ణ, కూతురు లక్కీలను శివకుమార్ ఎలా రక్షించుకున్నాడు? అసలు..అపర్ణ, లక్కీల అదృశ్యం వెనకాల ఉన్న రహాస్యం ఏమిటి? వరుసగా నమోదవుతున్న మిస్సింగ్ కేసుల సూత్రధారి ఎవరు? అన్నదే కథ.
విశ్లేషణ
ఐదుసంవత్సరాల నిడివిలో జరిగే కథ ‘ఉగ్రం’. యాక్సిడెంట్‌తో కథ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత శివకుమార్, అపర్ణల లవ్‌ట్రాక్ కాస్త బోరింగ్‌గా అని పిస్తుంది. గురుకుల పాఠశాలలో విద్యార్థినులను ఇబ్బంది పెడుతున్న గంజాయి ముఠాను అరెస్ట్ చేసేసన్నివేశం నుంచి కథలో వేగం పుంజుకుంటుంది. అపర్ణ, లక్కీల అదృశ్యం వెనకాల ఈ గంజాయిముఠా నాయకుడు గజేంద్ర అలియాస్ గని ఉన్నాడెమో? అన్నట్లుగా కథ ముందుకు సాగుతుంది. కానీ ఎప్పుడైతే అతను శివకుమార్ చేతిలో చనిపోతాడో అప్పట్నుంచి కథలో ఓ క్యూరియాసిటీ మొదలవుతుంది. సెకండాఫ్మొదలుకాగానే అపర్ణ, లక్కీలను కనిపెట్టేందుకు ఇంట్లోనే కేసును శివకుమార్ ఇన్విస్టిగేషన్ చేయడం, యాక్సిడెంట్ స్పాట్లో వరుస క్లూస్లను కనిపెడుతూ, హ్యూమన్ట్రాఫికింగ్ ముఠా రాకెట్‌ను చేధించడంవంటి స్క్రీన్ ప్లే కాస్త ఆసక్తికరంగానే సాగుతుంది. ఈ టైమ్‌లో రిలీల్ అయ్యే ట్విస్ట్‌గా ఆడియన్స్‌కు కొత్తగాఉంటుంది. క్లైమాక్స్ ఒకే. కానీ ప్రీ క్లైమాక్స్ గత డ్రాగ్డ్గా ఉంటుంది. మ్యూజిక్ ఒకే. బ్యాంగ్రౌండ్ స్కోర్ ఈసినిమాకు కొన్ని సన్నివేశాల్లో ప్లస్ పాయింట్. కాస్త ఎడిటింగ్ కత్తెర పడి ఉంటే బాగుండేది. దర్శకుడు విజయ్ కథను ఇంకాస్త ఇంట్రెస్టింగ్గా చెప్పవచ్చు.
పెర్ఫార్మెన్స్
శివకుమార్ పాత్రలో అల్లరి నరేశ్ అద్భుతంగా నటించారు. అల్లరి నరేశ్ క్యారెక్టర్లో మూడు వేరియేషన్స్ కనిపిస్తాయి. హీరో ఎంట్రీ సీన్, గురుకుల పాఠశాల, ఇంట్రవెల్లో రెయిన్ ఫైట్, ప్రీ క్లైమాక్స్ ఫైట్ ముఖ్యంగా క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్‌లో అదరగొట్టారు. తనదైన ఎమోషన్యాక్టింగ్ను చూపించారు.అయితే క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్ కాస్త ఓవర్ ది బోర్డ్ ఉన్నట్లుగా అనిపిస్తుంది. హీరోయిన్ మిర్నామీనన్ ఫస్టాఫ్‌లో బాగానే నటించారు సెకండాఫ్‌లో ఆమె పాత్రలేదు. కేవలం క్లైమాక్స్‌లోనే కనిపిస్తుంది. అయితే ఈ లోటును డాక్టర్ సునీతగా ఇంద్రజ భర్తీ చేశారు. చైల్డ్ ఆర్టిస్ట్ ఊహా మంచి మార్కులు కొట్టేసింది.
బలాలు
కథ, కథనం
స్టోరీలైన్
యాక్షన్ సీక్వెన్స్‌లు
బలహీనతలు
లవ్‌ట్రాక్
తొలిభాగంలో కాస్త సాగదీత