Allari Naresh’s Ugram: హాస్యనటుడి ఒకప్పుడు ఎన్నో విజయవంతమైన చిత్రాలను తీసిన అల్లరి నరేశ్‌కు కొంతకాలం కిందట హిట్ అన్న మాటే లేదు. అలాంటిది దాదాపు ఎనిమిది సంవత్సరాల తర్వాత దర్శకుడు విజయ్ కనకమేడల ‘నాంది’ సినిమాతో నరేశ్‌కు హిట్ ఇచ్చాడు. ఇప్పుడు ఈ ఇద్దరి కాంబినేషన్లో వస్తున్న తాజా చిత్రం ‘ఉగ్రం’. ఓ సీరియస్ పాయింట్‌ను ఈ సినిమాలో డీల్ చేసినట్లుగా తెలుస్తుంది. హ్యూమన్ ట్రాఫిక్ ప్రాబ్లమ్‌ను డీల్ చేశారా? అనిపిస్తుంది. షైన్ స్క్రీన్స్ పతాకంపై హారిష్ పెద్ది, సాహుగారపాటి నిర్మించిన ఈ చిత్రం మే 5న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఉగ్రం ట్రైలర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ చిత్రంలో మీర్నా మీనన్ హీరోయిన్గా నటించారు. ఫ్యామిలీతో హ్యాపీగా ఉన్న ఓ మధ్యతరగతి తండ్రి తన భార్య, కూతురు కోసం ఒక అవినీతి ముఠాతో చేసే పోరాటం నేపథ్యంలో ఉగ్రం చిత్రం ఉంటుందన్నట్లుగా తెలుస్తోంది.
You Might Also Like
Hero Ram 22 Movie Opening: రామ్ కొత్త చిత్రం ప్రారంభం
November 23, 2024
Zebra Movie Review: జీబ్రా మూవీ రివ్యూ- నాలుగు రోజుల్లో ఐదు కోట్లు
November 22, 2024