Pawan Kalyan HariHaraVeeraMallu: పవన్ కల్యాణ్ ప్రజెంట్ చేస్తున్న చిత్రాల్లో ‘హరిహర వీరమల్లు’(Pawan Kalyan HariHaraVeeraMallu) ఒకటి. ఈ ఏడాది సంక్రాంతికి ఈ సినిమానురిలీజ్ చేయాలని ఒకప్పుడు అనుకున్నారు. కానీ పవన్‌కల్యాణ్ ‘భీమ్లానాయక్’ సినిమాను ఒప్పుకోవడం,అనూహ్యాంగా ‘హరిహరవీరమల్లు’ సినిమా ప్లేస్‌లో ‘భీమ్లానాయక్’ సంక్రాంతి రేసులో నిలవడం, ఆ తర్వాత ‘ఆర్‌ఆర్‌ఆర్’ ఎఫెక్ట్‌తో ఫిబ్రవరి 25న రిలీజ్ కావడం జరిగిపోయాయి. ఇలా పెండింగ్‌లో పడిన ‘హరిహరవీరమల్లు’ సినిమాను పూర్తి చేసేయ్యాలని పవన్ డిసైడైయ్యారు. దీంతో ఈ సినిమా కొత్త షూటింగ్ షెడ్యూల్ షూటింగ్ ప్రారంభమైంది. దాదాపు వెయ్యిమంది ఫైటర్స్‌తో పవన్‌కల్యాణ్ పాల్గొనే యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ప్రముఖ యాక్షన్ కొరియోగ్రాఫర్ టోడర్ లాజరోవ్ నేతృత్వంలో యాక్షన్ సన్నివేశాలను తీస్తున్నారు. ఏఏమ్ రత్నం, దయాకర్ రావు నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ నిధీ అగర్వాల్ పంచమిగా కనిపిస్తారు. తెలుగు, తమిళం, హిందీ, కన్నడం, మలయాళం భాషల్లో రిలీజ్ కానున్న ఈ సినిమాకు ఎమ్ ఎమ్ కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్. హరిహరవీరమల్లు సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది.
Pawan Kalyan HariHaraVeeraMallu: వంద కాదు..వెయ్యి మంది
Pawan Kalyan HariHaraVeeraMallu Shoot Begins

Leave a comment
Leave a comment