పవన్‌కల్యాణ్, రానాలు హీరోలుగా సాగర్ కె చంద్ర దర్శకత్వంలో రూపొందిన చిత్రం భీమ్లా నాయక్ (BheemlaNayak) ఈ సినిమా ట్రైలర్‌ను ఫిబ్రవరి 21న విడుదల చేశారు. మలయాళంలో విజయం సాధిం చిన అయ్యప్పనుమ్ కోషియుమ్ చిత్రానికి తెలుగు రీమేక్‌గా రూపొందిన ఈ సినిమా(BheemlaNayak)కు త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్ ప్లే అందించారు.


ఈ చిత్రంలో సబ్ఇన్‌స్పెక్టర్ భీమ్లానాయక్ పాత్రలో పవన్‌కల్యాణ్, డేనియల్ శేఖర్ పాత్రలో రానా కనిపిస్తారు. పవన్‌కు జోడీగా నిత్యామీనన్ కనిపిస్తే, రానా సరసన సంయుక్తామీనన్న టించారు. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమా ఫిబ్రవరి 25న విడుదల కానుంది. అయితే పవన్‌కల్యాణ్ ఫ్యాన్స్‌ను మాత్రం భీమ్లానాయక్ ట్రైలర్ మెప్పించ లేకపోయింది. ముఖ్యంగా ఈ ట్రైలర్‌లో పవన్ కన్నా , రానాకే ఎక్కువగా డైలాగ్స్ ఉండటం కూడా పవన్ ఫ్యాన్స్‌కు రుచించడం లేదు.
Readmore: కొంపముంచిన పవన్‌కల్యాణ్..షాక్‌లో అజిత్, వరుణ్‌తేజ్, శర్వానంద్