కెరీర్లో ఫస్ట్‌టైమ్ శాకుంతలం అనే మైథలాజికల్ ఫిల్మ్ చేశారు సమంత (Samantha). దుష్యంత మహారాజు, శాకుంతలల అద్భుతప్రేమకావ్యం ఆధారంగా శాకుంతలం చిత్రం తెరకెక్కకుతోంది. గుణశేఖర్ ఈ సినిమాకు దర్శకుడు. శాకుంతలం చిత్రంలో శకుంతలగా సమంత (Samantha)., దుష్యంత మహారాజుగా మలయాళ యాక్టర్ దేవ్‌మోహన్ నటించారు. ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో అనసూయ, గౌతమి, మోహన్‌బాబు కనిపిస్తారు. తాజాగాశాకుంతలం చిత్రంలోని సమంత ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. దిల్‌రాజు ప్రొడక్షన్స్, గుణశేఖర్ టీమ్ .’వర్క్స్ పతాకాలపై దిల్ రాజు, నీలిమ గుణ నిర్మించారు. శాకుంతలం చిత్రం వేసవిలో విడుదల కానుంది.
శాకుంతలం సినిమా కాకుండా సమంత చేతిలో యశోద చిత్రం ఉంది. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో వేసిన మూడుకోట్ల సెట్లో జరుగుతోంది. అలాగే విజయ్‌సేతుపతి, నయనతార, సమంత చేసిన కాదు వాక్కుల రెండు కాదల్ వేసవిలో విడుదల కానుంది. ఈ రెండు చిత్రాలే కాకుండా శాంతరుబన్ జ్ఞానశేఖర్డైరెక్షన్లో డ్రీమ్‌వారియర్ పిక్చర్స్ పతాకంపై సమంత ఓ సినిమా కమిటైయ్యారు. ఈ చిత్రం షూటింగ్ స్టార్ట్ కావాల్సి ఉంది.
యశోద సినిమాకు హరి,హరిష్ దర్శకత్వం వహిస్తున్నారు. వరలక్ష్మీ శరత్‌కుమార్, ఉన్నిముకందన్, రావురమేష్ ఈ చిత్రంలో కీలక పాత్రధారులు. ప్రస్తుతం హోటల్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే సన్నివేశాలచిత్రీకరణ జరుగుతోంది. ఇందుకోసం సెట్స్ వేశారు. ఒక్కడు సినిమాకు చార్మినార్ సెట్ వేసినఅశోక్ ఈ చిత్రంలోని యశోద సినిమాకు సెట్ వేశాడు. ప్రియుడి చేతిలో మోసపోయిన నర్సు పాత్రలో సమంత కనిపిస్తే, ఆమెకు సహాయం చేసే పాత్రలో వరలక్ష్మీ శరత్‌కుమార్ కనిపిస్తారట.
ది ఫ్యామిలీమ్యాన్ 2 వెబ్‌సిరీస్ తర్వాత సమంత హిందీలో మరో ప్రాజెక్ట్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వలేదు. తాప్సీ ప్రొడక్షన్లో సమంత ఓ సినిమా చేయనున్నారనే టాక్ బీటౌన్‌లో వినిపించింది. అలాగే ది ఫ్యామిలీమ్యాన్ 2 తీసినరాజ్ అండ్ డీకే దర్శకత్వంలోనే సమంత మరో వెబ్‌సిరీస్‌కు సైన్ చేశారనే ప్రచారం బాలీవుడ్లో జరిగింది.
సమంత చేసే వెబ్‌సిరీస్‌లో వరుణ్‌ధావన్ ఓ హీరోగా నటిస్తారని, ఇందులో సమంతతో పాటు పలువురు కీలక పాత్రలు చేస్తారని తెలుస్తోంది. అయితే ప్రస్తుతం రాజ్ అండ్ డీకే దుల్కర్సల్మాన్ లవ్ అండ్గన్స్ వెబ్‌సిరీస్‌పై బిజీగా ఉన్నారు. ఈ వెబ్‌సిరీస్ అయిపోయిన తర్వాత కానీ సమంత నెక్ట్స్ వెబ్ప్రాజెక్ట్ను గురించిన ప్రకటన వస్తుందట. అయితే ఈ విషయాలపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది.
ఇక నాగచైతన్యతో విడాకుల తర్వాత షూటింగ్ లైఫ్‌లో కాస్త గ్యాప్ దొరికితే చాలు వేకేషన్‌కు వెళ్తున్నారు సమంత.మొన్నామధ్య సమంత స్విట్జర్లాండ్ వెళ్లారు. రీసెంట్గా కేరళ వెళ్లి అక్కడి జలపతాల దగ్గర కాస్త టైమ్ స్పెండ్చేశారు. ఈ ఫోటోలను, వీడియోలను సోషల్‌మీడియాలో షేర్ చేశారు. జీవితంలో వస్తున్న ప్లోను ఫాలోకావడమే మనం చేయాల్సిందన్నట్లుగా ఈ ఫోటోలకు క్యాప్షన్ ఇచ్చారు సమంత. ఇలా ఇటు సినిమాలను అటు పర్సనల్లైఫ్ను భలేగా బ్యాలెన్స్ చేస్తున్నారు సమంత.
https://www.instagram.com/p/CaKa4wThSCN/
Contents
కెరీర్లో ఫస్ట్‌టైమ్ శాకుంతలం అనే మైథలాజికల్ ఫిల్మ్ చేశారు సమంత (Samantha). దుష్యంత మహారాజు, శాకుంతలల అద్భుతప్రేమకావ్యం ఆధారంగా శాకుంతలం చిత్రం తెరకెక్కకుతోంది. గుణశేఖర్ ఈ సినిమాకు దర్శకుడు. శాకుంతలం చిత్రంలో శకుంతలగా సమంత (Samantha)., దుష్యంత మహారాజుగా మలయాళ యాక్టర్ దేవ్‌మోహన్ నటించారు. ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో అనసూయ, గౌతమి, మోహన్‌బాబు కనిపిస్తారు. తాజాగాశాకుంతలం చిత్రంలోని సమంత ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. దిల్‌రాజు ప్రొడక్షన్స్, గుణశేఖర్ టీమ్ .’వర్క్స్ పతాకాలపై దిల్ రాజు, నీలిమ గుణ నిర్మించారు. శాకుంతలం చిత్రం వేసవిలో విడుదల కానుంది.శాకుంతలం సినిమా కాకుండా సమంత చేతిలో యశోద చిత్రం ఉంది. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో వేసిన మూడుకోట్ల సెట్లో జరుగుతోంది. అలాగే విజయ్‌సేతుపతి, నయనతార, సమంత చేసిన కాదు వాక్కుల రెండు కాదల్ వేసవిలో విడుదల కానుంది. ఈ రెండు చిత్రాలే కాకుండా శాంతరుబన్ జ్ఞానశేఖర్డైరెక్షన్లో డ్రీమ్‌వారియర్ పిక్చర్స్ పతాకంపై సమంత ఓ సినిమా కమిటైయ్యారు. ఈ చిత్రం షూటింగ్ స్టార్ట్ కావాల్సి ఉంది.యశోద సినిమాకు హరి,హరిష్ దర్శకత్వం వహిస్తున్నారు. వరలక్ష్మీ శరత్‌కుమార్, ఉన్నిముకందన్, రావురమేష్ ఈ చిత్రంలో కీలక పాత్రధారులు. ప్రస్తుతం హోటల్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే సన్నివేశాలచిత్రీకరణ జరుగుతోంది. ఇందుకోసం సెట్స్ వేశారు. ఒక్కడు సినిమాకు చార్మినార్ సెట్ వేసినఅశోక్ ఈ చిత్రంలోని యశోద సినిమాకు సెట్ వేశాడు. ప్రియుడి చేతిలో మోసపోయిన నర్సు పాత్రలో సమంత కనిపిస్తే, ఆమెకు సహాయం చేసే పాత్రలో వరలక్ష్మీ శరత్‌కుమార్ కనిపిస్తారట.ది ఫ్యామిలీమ్యాన్ 2 వెబ్‌సిరీస్ తర్వాత సమంత హిందీలో మరో ప్రాజెక్ట్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వలేదు. తాప్సీ ప్రొడక్షన్లో సమంత ఓ సినిమా చేయనున్నారనే టాక్ బీటౌన్‌లో వినిపించింది. అలాగే ది ఫ్యామిలీమ్యాన్ 2 తీసినరాజ్ అండ్ డీకే దర్శకత్వంలోనే సమంత మరో వెబ్‌సిరీస్‌కు సైన్ చేశారనే ప్రచారం బాలీవుడ్లో జరిగింది.సమంత చేసే వెబ్‌సిరీస్‌లో వరుణ్‌ధావన్ ఓ హీరోగా నటిస్తారని, ఇందులో సమంతతో పాటు పలువురు కీలక పాత్రలు చేస్తారని తెలుస్తోంది. అయితే ప్రస్తుతం రాజ్ అండ్ డీకే దుల్కర్సల్మాన్ లవ్ అండ్గన్స్ వెబ్‌సిరీస్‌పై బిజీగా ఉన్నారు. ఈ వెబ్‌సిరీస్ అయిపోయిన తర్వాత కానీ సమంత నెక్ట్స్ వెబ్ప్రాజెక్ట్ను గురించిన ప్రకటన వస్తుందట. అయితే ఈ విషయాలపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది.ఇక నాగచైతన్యతో విడాకుల తర్వాత షూటింగ్ లైఫ్‌లో కాస్త గ్యాప్ దొరికితే చాలు వేకేషన్‌కు వెళ్తున్నారు సమంత.మొన్నామధ్య సమంత స్విట్జర్లాండ్ వెళ్లారు. రీసెంట్గా కేరళ వెళ్లి అక్కడి జలపతాల దగ్గర కాస్త టైమ్ స్పెండ్చేశారు. ఈ ఫోటోలను, వీడియోలను సోషల్‌మీడియాలో షేర్ చేశారు. జీవితంలో వస్తున్న ప్లోను ఫాలోకావడమే మనం చేయాల్సిందన్నట్లుగా ఈ ఫోటోలకు క్యాప్షన్ ఇచ్చారు సమంత. ఇలా ఇటు సినిమాలను అటు పర్సనల్లైఫ్ను భలేగా బ్యాలెన్స్ చేస్తున్నారు సమంత.