Akhil Agent: అఖిల్ హీరోగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా ఏంజెంట్. ఈ చిత్రం గత ఏడాదే విడుదల కావాల్సింది. కానీ కోవిడ్ కారణంగా షూటింగ్ ఆలస్యం కావడంతో రిలీజ్‌కు నోచుకోలేదు. అయితేతాజాగా ఏజెంట్ కొత్త రిలీజ్ డేట్ ఫిక్సయింది. ఈ ఏడాది ఆగస్టు 12న ఏంజెంట్ చిత్రాన్ని విడుదల చేయ నున్నట్లుగా చిత్రంబృందం ప్రకటించింది. దేశభక్తి నేపథ్యంలో సాగే ఈ స్పై థ్రిల్లర్ మూవీలో మల యాళ స్టార్ హీరో మమ్ముట్టీ ఓ కీలక పాత్ర చేస్తున్నారు. ముంబై మోడల్ సాక్షీ వైద్య హీరోయిన్. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఈ చిత్రం మరి..ఈ సారైనా చెప్పిన తేదీకి రిలీజ్ అవుతుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ.
Samantha Varundwavan webseries: సమంత సెకండ్ వెబ్‌సిరీస్ ఫిక్స్!