అక్కినేని నాగార్జున, నాగ చైతన్య, రమ్యకృష్ణ, కృతీశెట్టి ప్రధాన పాత్రల్లో కల్యాణకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా బంగార్రాజు. సొగ్గాడు మళ్లీ వచ్చాడు అనేది క్యాప్షన్. మొన్నటివరకు హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా షూటింగ్ మైసూర్‌కు షిప్ట్ అయ్యింది. నాగార్జున అండ్ టీమ్ మంగళవారం మైసూర్ చేరుకున్నారు. ఆల్రెడీ తాను హీరోగా నటిస్తున్న థ్యాంక్యూ చిత్రం కోసం నాగచైతన్య మైసూర్లో ఉన్న సంగతి తెలిసిందే. బంగార్రాజు కొత్త షెడ్యూల్లో నాగార్జున, నాగచైతన్యలపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తారు.
బంగార్రాజు చిత్రంలోని లడ్డుండా పాట లిరికల్ వీడియోను మంగళవారం విడుదల చేశారు. కథ రిత్యా స్వర్గంలో ఉండే రంభ,ఊర్వశీ, మేనకలతో బంగార్రాజు(నాగార్జున) చిందులు వేసే పాట ఇది. ఇక బంగార్రాజు సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 15న విడుదల చేయాలనుకుంటున్నారు. ఇక నాగార్జున, కల్యాణ్‌కృష్ణ కాంబినేషన్లో వచ్చిన సొగ్గాడే చిన్ని నాయానా చిత్రానికి ప్రీ క్వెల్‌గా తెరకెక్కు తున్న ఈ సినిమా పై ప్రేక్షకుల్లో అంచనాలు ఉన్నాయి. చలపతి రావు, రావు రమేష్, బ్రహ్మాజి, వెన్నెల కిషోర్, ఝాన్సీ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు అనూప్‌రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు.