శ్రీవిష్ణు, అమ్రితా అయ్యర్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం అర్జున ఫల్గుణ. తేజ మర్ణాని డైరెక్ట్ చేసిన చిత్రం ఇది. నవంబరు 09న ఈ సినిమా టీజర్ విడుదలైంది. నాది కానీ కురుక్షేత్రంలో నాకు తెలియని పద్మవ్యూహంలో ఇరుక్కుపోయాను. అయినా బలైపోవడానికి నేను అభిమన్యుడిని కాదు. అర్జునుడిని
అని టీజర్లో ఉన్న డైలాగ్స్ ఆసక్తికరంగా ఉన్నాయి.
ఈ చిత్రంలో ఎన్టీఆర్ అభిమాని పాత్రలో కనిపిస్తారు శ్రీవిష్ణు. ఎక్కువగా క్లాస్ రోల్స్‌లో కనిపించే శ్రీవిష్ణు ను ఈ సినిమాలో మాస్‌గా చూపిఒంచే ప్రయత్నం చేశారు దర్శకుడు తేజ. రాజరాజచోర
వంటి సక్సెస్ఫుల్ మూవీ తర్వాత వస్తున్న ఈ చిత్రం పై శ్రీ విష్ణు మరో హిట్ ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమా త్వరలో విడుదల కానుంది.