Sitara Ghattamaneni: సూపర్‌స్టార్ మహేశ్‌బాబు కుమార్తె (Sitara Ghattamaneni) డ్యాన్స్ ఇరగదీస్తోంది. రీసెంట్గా మహేశ్‌బాబు హీరోగా నటి స్తున్న ‘సర్కారువారిపాట’ చిత్రంలోని ట్రెండీ సాంగ్ ‘పెన్నీ’లో అదిరిపోయే స్టెప్స్ వేశారు సితార. ఇప్పుడు క్లాసికల్ డ్యాన్స్‌ను ఇరగదీశారు. సితార కూచిపూడి డ్యాన్స్ వేస్తున్న వీడియోను మహేశ్‌బాబు శ్రీరామనవమి సంద ర్భంగా సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతోంది. ‘‘సితార కూచిపూడి డ్యాన్స్‌ను పారాయణం చేస్తున్న తొలి వీడియో ఇది. ఎంతో ప్రత్యేకమైన శ్రీరామనవమి రోజున. ఈ వీడియోలో ని శ్లోకం రాముడిని గొప్పదనాన్ని తెలియజేస్తుంది’’ అని ట్వీట్ చేశారు మహేశ్‌బాబు. ఇక మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న సర్కారువారిపాట చిత్రం మే 12న రిలీజ్ కానుంది.
Sitara's first Kuchipudi dance recital… Couldn't be happier to present it on this auspicious day of #SriRamaNavami. This Shloka speaks of the greatness of Lord Rama! pic.twitter.com/QKYHqOmXX5
— Mahesh Babu (@urstrulyMahesh) April 10, 2022
Maheshbabu Sarkaru Vaari Paata: స్పెషల్..పెన్నీ!