Maheshbabu Sarkaru Vaari Paata: మహేష్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారువారిపాట’ (Maheshbabu Sarkaru Vaari Paata) చిత్రం నుంచి ‘పెన్నీ. .పెన్నీ..ఎవ్రీ పెన్ని..’ అనే పాట లిరికల్ వీడియో రిలీజైంది. ఈ పాటలో మహేశ్‌బాబు కుమార్తె సితా ర మెరవడం విశేషం. పరశురామ్ దర్శకత్వంలో రూపొం దుతోన్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ ఫిల్మ్‌లో కీర్తీ సురేశ్ హీరోయిన్గా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం మే 12న రిలీజ్ కానుంది. ‘వెన్నెల’ కిషోర్, సుబ్బ రాజు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ డైరెక్టర్. వడ్డీ వ్యాపారం నడిపే ఓ అనాథ పాత్రలో మహేశ్‌బాబు కనిపిస్తారీ చిత్రంలో. చైల్డ్ ఎపిసోడ్ కూడా ఉంది. చిన్నప్పటి మహేశ్బాబుగా సుధీర్‌బాబు కుమారుడు దర్శన్ కనిపిస్తాడు. అలాగే ఓ ప్లాష్‌బ్యాక్ ఏపిసోడ్ కూడా ఈ చిత్రంలో ఉందని తెలిసింది.


Read more Nani Dasara: ధరణి ఫ్రమ్ దసరా