Nani Dasara: నాని హీరోగా చేస్తున్న తాజా చిత్రం ‘దసరా’. శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాతో దర్శకునిగా పరిచయం అవు తున్నారు. ‘నేను లోకల్’ తర్వాత నాని, కీర్తీ సురేశ్ జంటగా నటిస్తున్న ఈ సినిమాను సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. గోదావరి ఖని ప్రాంతంలోని సింగరేణి కోల్‌మైన్స్‌లో ఉండే ఓ గ్రామానికి చెందిన కథే దసరా చిత్రం. ఫ్యామిలీ డ్రామాగా ‘దసరా’ (Nani Dasara) సినిమాను తెరకెక్కిస్తున్నారు.
తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ‘స్పార్క్ ఆఫ్ దసరా’ అంటు ఓ వీడియోను కూడా విడుదల చేశారు. ఈ చిత్రంలో నెగటివ్ షేడ్స్‌తో ఉండే ధరణి పాత్రలో నాని కనిపిస్తారు. అయతే విడుదలైన దసరా టీజర్‌ను బట్టి ఈ సినిమాలో నాని క్యారెక్టర్ ఫుల్ మాస్ అని తెలుస్తోంది. సముద్రఖని, సాయికుమార్, జరీనా వాహబ్ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. సంతోష్ నారాయణన్ ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్.
Readmore: దసరా ప్రారంభం