‘దసరా’ ప్రారంభోత్సవం జరిగింది. ‘నేను లోకల్’ వంటి హిట్ మూవీ తర్వాత హీరో నాని, హీరోయిన్ కీర్తీ సురేశ్ చేస్తున్న ఈ సినిమా ‘దసరా’. సుధాకర్ చెరుకూరి నిర్మాణంలో శ్రీకాంత్ ఒదేలా అనే వ్యక్తి దర్శకుని గా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. సంతోష్ నారాయణ్ ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్. ఈ సినిమాను ఈ ఏడాది చివర్లో విడుదల చేయాలనుకుంటున్నారు.
ఇక ‘దసరా’ విషయానికి వస్తే..విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే రివేంజ్ డ్రామాగా తెలుస్తోంది. నాని క్యారెక్టర్‌లో నెగటివ్ షేడ్స్ ఉన్నాయట. అలాగే ఇది పీరియాడికల్ డ్రామా అని తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్‌ను
మార్చిలో స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. ఇక నాని నటించిన తాజా చిత్రం అంటే..సుందరానికీ(Ante Sundaraniki) రిలీజ్‌కు రెడీగా ఉంది.
కొంపముంచిన పవన్‌కల్యాణ్..షాక్‌లో అజిత్, వరుణ్‌తేజ్, శర్వానంద్