Allu Arjun: ‘ఆర్య’, ‘ఆర్య 2’ చిత్రాల తర్వాత దర్శకుడు సుకుమార్, హీరో అల్లు అర్జున్ కాంబినేషన్లో రూపొందిన చిత్రం ‘పుష్ప’. ఈ చిత్రంలోని తొలిపార్టు ‘పుష్ప: ది రైజ్’ గత ఏడాది డిసెంబరు 17న విడుదలై అద్భుత విజయాన్ని సాధించింది. హిందీలో కూడా విడుదలైన ఈ చిత్రం బాలీవుడ్ బాక్సాఫీసు వద్ద వందకోట్ల వసూళ్లను రాబట్టింది. దీంతో అల్లు అర్జున్ మామయ్య డాక్టర్ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి (భార్యఅల్లు స్నేహారెడ్డి తండ్రి) అల్లు అర్జున్ను సన్మానించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా నటులు చిరంజీవి, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, కేంద్ర మాజీ మంత్రి, కళాబంధు టి. సుబ్బిరామిరెడ్డి , భానుప్రకాష్ ఐఏఎస్ (మాజీ యూనిటెడ్ ఆంధ్ర ప్రదేశ్ దేశ్ ప్రిన్సిపాల్ సెక్రటరీ పీఎంవో చీఫ్ సెక్రటరీ ఆఫీస్ మరియు మాజీ అస్సాం చీఫ్ సెక్రెటరీ ) ప్రముఖ దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్, హరీష్ శంకర్, క్రిష్, గుణశేఖర్ లతో పాటు తదితర ప్రముఖులు హాజరయ్యారు. ఈ వేడుకలో అల్లు అర్జున్ ఫ్యా¯Œ ్స అసోసియేషన్ అధ్యక్షుడు గడ్డం రవికుమార్ గజమాలతో అల్లుఅర్జున్‌కు సత్కరించారు.
Allu Arjun: చిరంజీవి సమక్షంలో అల్లు అర్జున్‌కు సన్మానం
Leave a comment
Leave a comment