Allu Arjun with Rajamouli అల్లు అర్జున్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనుంది. అయితే ఈ భారీ బడ్జెట్ ఫిల్మ్ ఈ ఇద్దరు వారి వారి కమిట్మెంట్స్ను పూర్తి చేసిన తర్వాతే film ఉంటుందన్నట్లుగా తెలుస్తోంది. రాజమౌళి ప్రస్తుతం ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా నటించిన ఆర్ ఆర్ఆర్’ సినిమా రిలీజ్ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం ఈ నెల 25న విడుదల కానుంది. ఈ చిత్రం తర్వాత మహేశ్‌బాబు హీరోగా రాజమౌళి కాంబినేషన్లోని సినిమా తెరకెక్కుతుంది. ఈ మూవీ తర్వాతే అల్లు అర్జున్‌తో రాజమౌళి సినిమా చేస్తారు. ఇక ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలోని ‘పుష్ప 2’తో అల్లు అర్జున్ బిజీగా ఉంటున్నారు. ఈ మూవీ తర్వాత బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీతో ఫిల్మ్ చేస్తారు అల్లు అర్జున్. ఈ నెక్ట్స్ రాజమౌళి కాంబినేషన్లోని సినిమాతో బిజీ అవుతారు అల్లు అర్జున్. అయితే ఈ సినిమా 2024లోనే స్టార్ట్ అవు తుంది.