Aamir Khan: బాలీవుడ్ స్టార్ హీరో అమిర్‌ఖాన్ ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమా ఢిల్లీ ఈవెంట్‌లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమిర్‌ఖాన్ గురించి ‘ఆర్‌ఆర్‌ఆర్’ మూవీ దర్శకుడు రాజమౌళి కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు.


‘‘ఆమిర్‌ఖాన్ ముందు కథ వింటారు. ఆ తర్వాత ఈ కథలో ఏ డైలాగ్స్ అయితే కష్టంగా
ఉంటాయో వాటిని ముందుగా ఓ బుక్‌లో రాస్తారు. ఆ డైలాగ్‌ను ఆ రోజు రాస్తూ చదువుతారు. మరుసటి
రోజు ఈ సినిమాలోని మరో కష్టమైన డైలాగ్‌ను పేపర్‌పై రాస్తారు. ఈ డైలాగ్‌ను, ముందురోజు రాసిన డైలా గ్‌ను మళ్లీ చదువుతూ రాస్తారు. మూడోరోజు మరో కష్టమైన డైలాగ్‌ను తీసుకుంటారు. ఇప్పుడు మొదటి
రోజు, రెండో రోజు రాసుకున్న డైలాగ్స్‌తో కలిపి మూడో రోజు రాసుకున్న కష్టమైన డైలాగ్‌ను కూడా చదువు
తారు. రాస్తారు. ఇలా..ఒక సినిమా వందరోజులు షూటింగ్ జరుపుకుంటే ఆ సినిమాలోని కష్టమైన డైలాగ్స్
అన్నింటినీ ఆమిర్‌ఖాన్ ప్రతిరోజూ రాస్తూనే ఉంటారు. ఇలా..ఆమిర్‌ఖాన్‌తో ఆ సినిమా చేసే దర్శకుడు, రచయిత డైలాగ్స్ మర్చిపోయిన కానీ ఆమిర్‌మాత్రం ఆ డైలాగ్స్‌ను మర్చిపోరు. ఆమిర్ తాను డైలాగ్స్‌ను
ప్రాక్టీస్ చేసే ఈ విధానం గురించి నాకు ఓ సందర్భంగా వివరించినప్పుడు నేను భయపడిపోయాను’’
అన్నారు. ఇంకా మాట్లాడుతూ– ‘‘బాహుబలి’ సినిమాను నాలుగు భాషల్లో రిలీజ్ చేశాం. ఇప్పుడు ‘ఆర్‌ఆర్ ఆర్’ సినిమాను ఐదు భాషల్లో రిలీజ్ చేస్తున్నాం. కానీ ఆమిర్‌కాన్ చేసిన లగాన్ సినిమా దేశవ్యాప్తంగా ఎప్పుడో భాషపరమైన హద్దులను దాటుకుని అందరికీ కనెక్ట్ అయ్యింది. ఈ విషయంలో లగాన్ ప్రభావం నాపై ఉంది.
హ్యూమన్ ఎమోషన్స్‌తో ఆడియన్స్‌ను కనెక్ట్ చేయవచ్చని లగాన్‌తోనే నేర్చుకున్నాను’’ అన్నారు.
ఇదే ఈవెంట్‌లో ఆమిర్‌ఖాన్ మాట్లాడుతూ– ‘‘నాకు డైలాగ్స్ పెద్దగా గుర్తుండవు. అందుకే అలా ప్రాక్టీస్ చేస్తుంటాను. ఇక రాజాగారి (రాజమౌళి) ‘బాహుబలి 2’ నిజమైన ప్యాన్‌ఇండియన్ ఫిల్మ్‌గా నిలిచింది. ఇప్పుడు ఆర్‌ఆర్‌ఆర్ కోసం నేను కూడా ఓ ప్రేక్షకుడి మాదిరి ఎదురుచూస్తున్నాను. ‘ఆర్‌ఆర్‌ఆర్’కు ఆల్ ది బెస్ట్’’అన్నారు. ఇక రాజమౌళి దర్శకత్వంలో ఆమిర్‌ఖాన్ హీరోగా మహాభారతంగా ఆధారంగా ఓ మైథలాజికల్ ఫిల్మ్ రూపుదిద్దుకోనుందని ఎప్పట్నుంచో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఆర్‌ఆర్‌ఆర్ విషయానికి వస్తే..ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లు హీరోలుగా నటించిన ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రం మార్చి 25న విడుదల అవుతుంది.
Readmore:Allu Arjun: చిరంజీవి సమక్షంలో అల్లు అర్జున్‌కు సన్మానం