Aishwarya R. Dhanush: రజనీకాంత్ కుమార్తె ఐశ్యర్యారజనీకాంత్ (Aishwarya R. Dhanush) దర్శకురాలు అన్న సంగతి తెలిసిందే. ధనుష్ హీరోగా నటించిన ‘3’(2012), ‘వాయ్ రాజా వాయ్’(2015) వంటి సినిమాలకు ఐశ్వర్యారజనీకాంత్ దర్శకత్వం వహించారు. ఆ తర్వాత ధనుష్‌ను వివాహం చేసుకున్నారామె (Aishwarya R. Dhanush:). కొన్ని సంవత్సరాల దాంపత్యజీవితం తర్వాత ధనుష్‌తో ఇటీవల ఆమె విడాకులు తీసు కున్నారు. అయితే ఇప్పుడు మళ్లీ ఐశ్వర్యా తన దర్శకత్వం పై దృష్టి సారించారు. ఇప్పటికే లైకా ప్రొడక్ష న్స్‌లో ఓ సినిమాకు దర్శకత్వం వహించేందుకు కమిటై య్యారు ఐశ్వర్య.
తాజాగా ఐశ్వర్యారాజేశ్ హిందీలో ఓ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. ‘ఓ సాథీ చల్’ అనే టైటల్ ఖరారు చేశారు. ‘యాన్ ఎక్ట్రార్డినరీ ట్రూ లవ్‌స్టోరీ’ అనేది క్యాప్షన్. మీనూ ఆరోర, క్లౌడ్ 9 పిక్చర్స్, అర్చన యస్ సదానంద్, నీరజ్ మైనీ నిర్మిస్తారు. అయితే ‘ఓ సాథీ చల్’ ఐశ్వర్యాధనుష్‌కు దర్శకురాలుగా హిందీలో తొలి చిత్రం కావడం విశేషం.
Readmore Rajamouli:ఆ RRRను మించిన కామెడీ ఫిల్మ్ మరొకటి లేదు