Rajamouli: దర్శకుడు రాజమౌళి (Rajamouli) తెరకెక్కించిన సినిమాలు అద్భుత విజయాలను సాధించాయి. ఏ దర్శకుడికైనా కూడా తన టీమ్ చాలా ఇంపార్టెంట్. తన టీమ్‌ను గురించి ఎప్పుడు ప్రస్తావించని రాజమౌళి బెంగళూరు లో జరిగిన ఆర్ ఆర్ ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్పందించారు. తన టీమ్‌లో క్రియా శీలకంగా వ్యవ హరించే పది మంది వ్యక్తుల గురించి రాజమౌళి చెప్పు కొచ్చారు.
రాజమౌళి మాట్లాడుతూ- “
నా కో డైరెక్టర్ కోటి గారు. నేను అసిస్టెంట్ డైరెక్టర్‌గా వర్క్ చేసినప్పుడు నేను ఆయన అసోసియేట్ డైరెక్టర్. నేను ఆయన కింద పని చేశాను. తర్వాత నేను డైరెక్టర్ అయ్యాక ఆయన నాకు అసోసియేట్ డైరెక్టర్‌గా వచ్చారు. నేను షూటింగ్లో కాను, కథ చర్చల్లో కానీ తప్పు చేస్తే ధైర్యంగా నా వద్దకు వచ్చీ నన్ను కరెక్ట్ చేస్తారు. నా తొలి సీరియల్ శాంతినివాసం నుంచి నాకు తోడుగా ఉంటున్నాడు అసిస్టెంట్ డైరెక్టర్ శీను. మరో అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీరామ్. మెరపులా వర్క్ చేస్తుంటాడు. కిరణ్ అండ్ అనిల్ వెనక ఉండి వర్క్ చేస్తారు. ఆన్లైన్ ఎడిటర్ నాగార్జున అద్భుతంగా చూపించారు. నటీనటులు, లీగర్ యాస్పెట్స్ ఇలా అందర్నీ కో ఆర్డినేట్ చేస్తూ ఎంతో కష్టపడ్డాడు రాహుల్. డబ్బింగ్ వర్క్ అంతా సురేశ్ చూసుకున్నాడు. ఐదు భాషల్లో బాగా చేశాడు. సుధాకర్, సుబ్బు బాగా చేశారు. వీరే నాకు ఫిల్లర్స్. వీరే లేకపోతే నేను అను కున్న ట్లుగా సినిమాలు తీసేవాడిని కాదు. హీరోలకు రాకముందే మా అసిస్టెంట్ డైరెక్టర్స్‌పై మాకు మేమే టెస్ట్ షూటింగ్ చేసుకుంటాము. ఆర్ఆర్ఆర్కు చేశాం. ఈ ఆర్ఆర్ఆర్ రిలీజ్ చేసిన తరవాత మా అసిస్టెంట్ డైరెక్టర్స్ చేసిన ఆర్ఆర్ఆర్ చూపిస్తాం. రిలీజ్ చేస్తాం. ఇంతకన్నా ఎక్కువగా కామెడీ ఫిల్మ్ ఉండదు. సీనియర్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ యోగానంద్గారు బల్గేరియా షెడ్యూల్లో బాగా హెల్ప్ చేశారు. ఆ భాష రాకపోయినా..సరే. ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్‌గారు, డీవీపీ సెంధిల్, విఎఫ్ఎక్స్ సూపర్వైజర్ శ్రీనివాసమోహన్, మా ఆవిడ రమాగారు విజువల్‌గా వర్క్ చేశారు. ఆర్ఆర్ఆర్ కు వీరు పని వల్లే విజువల్ ట్రీట్ అయ్యింది. వీరే నా ఫిల్లర్స్. వీరందరి వల్లే నేను అనుకున్నట్లుగా ఆర్ ఆర్ ఆర్‌ను తీయగలిగాను అని అన్నారు.