Yash K.G.F: Chapter 2: యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ‘కేజీఎఫ్ చాప్టర్ 1’ ఎంతటి ఘనవిజయాన్ని సాధించిందో చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇదే సినిమాకు సీక్వెల్‌గా ‘కేజీఎఫ్ చాప్టర్ 2’(Yash K.G.F: Chapter 2) వస్తోంది. యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలోనే రూపొందిన ఈ కేజీఎఫ్ చాప్టర్ 2 ఈ ఏడాది ఏప్రిల్ 14న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్‌ను స్పీడప్ చేశారు చిత్రంయూనిట్. ఈ నెల 27 అంటే మార్చి 27న ‘కేజీఎఫ్ చాప్టర్2’ ట్రైలర్ రిలీజ్ కానుంది. ఈ ట్రైలర్ కంటే ముందు ‘కేజీఎఫ్ చాప్టర్ 2’ నుంచి ‘తుఫాన్’ అనే సాంగ్ లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు.
‘కేజీఎఫ్ చాప్టర్ 1’ అద్భుత విజయాన్ని సాధించింది. ఇది ఎంతటి విజయం అంటే ‘కేజీఎఫ్ చాప్టర్ 2’ రిలీజ్ అవుతున్న ఏప్రిల్ 14న మరో సినిమా విడుదల కావడం లేదు. రిలీజ్ పరంగా ఇది మంచి తేదీయే అయిన ప్పటికీని పెద్ద పెద్ద సినిమాలు కూడా కేజీఎఫ్‌కు పోటీగా బాక్సాఫీసు బరిలో నిలిచేందుకు సాహసించడం లేదు. ఇక చాప్టర్ 1లో కన్నడ స్థాయి యాక్టర్స్ మాత్రమే ఉన్నారు. కానీ చాప్టర్ 2లో అన్నీ భాషల నటీ నటులను ఎంపిక చేసుకున్నారు ఈ చిత్రం దర్శకుడు ప్రశాంత్ నీల్. ‘కేజీఎఫ్ చాప్టర్ 1’లో కనిపించని సంజయ్‌దత్, ప్రకాశ్‌రాజ్, రావురమేష్, రవీనా టాండన్ సెకండ్ పార్టులో కనిపిస్తారు. ‘కేజీఎఫ్ చాప్టర్ 2’లో శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటించారు. బెంగళూరులోని ఓ మారుమూల గ్రామంలో జన్మించిన ఓ కుర్రాడు రాఖీ భాయ్ (రామకృష్ణ) డాన్‌గా ఎదిగి ముంబై గోల్డ్ మాఫియాను ఎలా శాసించాడు? అన్న కథాంశం నేపథ్యంలో ‘కేజీఎఫ్ చాప్టర్ 2’ సాగుతుంది.