Taapsee ShabaashMithu:క్రికెటర్ మిథాలీరాజ్ జీవితం ఆధారంగా రూపొందిన బయోపిక్ ‘శభాష్మీతూ’ (taapsee ShabaashMithu). సర్జిత్ ముఖర్జీ దర్శకుడు. ఈ బయోపిక్‌లో మిథాలీరాజ్‌గా తాప్సీ నటించారు. ఇప్పటికే ఈ సినిమా విడుదలపలుమార్లు వాయిదా పడింది. ఒక దశలో ఓటీటీలో కూడా విడుదల అవుతుందనే ప్రచారం కూడా జరిగింది. అయితే ఈ సినిమాను తాజాగా థియేటర్స్‌లోనే విడుదల చేయాలని చిత్రం యూనిట్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. తాజాగా ‘శభాష్ మీతూ’టీజర్‌ను విడుదల చేసింది చిత్రం యూనిట్. టీజర్లో మిథాలీరాజ్ లుక్‌లో తాప్సీ అదిరిపోయారని నెటిజన్లు అంటు న్నారు. మరికొందరు శభాష్ తాప్సీ అంటున్నారు. ఇక మహిళల అంతర్జాతీయ క్రికెట్లో మిథాలీ రాజ్‌ది ప్రత్యేకస్థానం. కొన్ని రికార్డ్స్ కూడా మిథాలీ ఖాతాలో ఉన్నాయి. 2017లో జరిగిన మహిళల క్రికెట్ ప్రపంచకప్‌లో మిథాలీరాజ్‌గా కెప్టెన్సీలో భారత జట్టు ఫైనల్స్‌కు చేరి ంది. ప్రస్తుతం మహిళల భారత క్రికెట్ జట్టు వన్డే, టెస్ట్ కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు మిథాలీరాజ్.
Readmore:Rajamouli:ఆ RRRను మించిన కామెడీ ఫిల్మ్ మరొకటి లేదు