Hrithik Roshan: దర్శకుడిగానే కాదు…మార్కెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా రాజమౌళి విజన్ అదిరి పోయేలా ఉంటుంది. ‘ఆర్ఆర్ఆర్’ సినిమానే ఓ ఉదాహరణగా తీసుకుంటే హిందీ మార్కెట్‌ను ఏట్రాక్ట్ చేయడం కోసం అజయ్‌దేవగన్, ఆలియాభట్‌ను తీసుకున్నారు. సినిమాలో వీరి పాత్రల నిడివి ఎంత ఉందన్న విషయం పక్కన పెడితే…మార్కెట్ పరంగా ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో అజయ్ దేవగన్,ఆలియాభట్ ఉండటం వర్కౌట్ అయ్యింది. హిందీ ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు మంచి వసూళ్లే వచ్చా యి. ఇప్పుడు మహేశ్‌బాబుతో ఇంటర్నేషనల్ మూవీ చేస్తున్నారు రాజమౌళి. ఈ సినిమా స్థాయికి తగ్గట్లే క్యాస్టింగ్‌ను ప్లాన్ చేస్తున్నాడు రాజమౌళి. హాలీవుడ్ క్యాస్టింగ్ ఏజెన్సీ సీఏఏతో ఒప్పందం కుదర్చుకున్నారు రాజమౌళి. సో..ఇంటర్నేషనల్ మార్కెట్‌ను రాజమౌళి టార్గెట్ చేసినట్లు అవుతుంది. ఎలాగూ జపాన్‌లో రాజమౌళి సినిమాలకు మంచి మార్కెట్ ఉంది. ‘ఆర్ఆర్ఆర్’కు జపాన్‌లో వందకోట్ల రూపాయల వసూళ్లు రావడమే ఇందుకు ఓ ఉదాహరణ. ఇప్పుడు కూడా రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు సంబంధించిన స్క్రీనింగ్ కోసం జపాన్‌లోనే ఉన్నారు.
ఇక బాలీవుడ్ మార్కెట్‌ను మరింత ఎఫెక్టివ్‌గా టార్గెట్ చేసేందుకు హృతిక్‌రోషన్‌ను ఈ సినిమాలో ఓ రోల్ కోసం సంప్రదించారట రాజమౌళి. ఒకవేళ ఈ సినిమాకు హృతిక్ రోషన్ ఒప్పుకుంటే ఈ సిని మాకు మరింత మైలేజ్ వస్తుంది. పైగా.. .మహేశ్ బాబు, హృతిక్‌రోషన్‌లు ఒకే స్క్రీన్ షేర్ చేసుకుంటే అదిరిపోయేలా ఉంటుంది.
ఆల్రెడీ ‘వార్ 2’ కోసం ఎన్టీఆర్‌తో కలిసి నటిస్తున్నారు హృతిక్‌రోషన్. మరి..మహేశ్ సినిమాలో హృతిక్ నటిస్తారా? ఒకవేళ ఒప్పుకుంటే హృతిక్‌ది విలన్ రోల్ అవు తుందా? లేదా ఓ లీడ్ రోల్లా ఉంటుందా? అనేది తెలియాల్సి ఉంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది.
తన సినిమాలను గురించి ఓ ప్రెస్‌మీట్ నిర్వహించి, ఆ సినిమా స్టోరీలైన్, నటీనటుల వివరాలను అందరితో పంచుకోవడం రాజమౌళి స్టైల్. మరి..మహేశ్ సినిమాను గురించి రాజమౌళి నిర్వహించే సమావేశం వరకు వెయిట్ చేస్తే మరిన్ని వివరాలు తెలుస్తాయి.