Pawan OG: పవన్‌కళ్యాణ్ హీరోగా నటిస్తున్న సినిమాల్లో ‘ఓజీ’ ఒకటి. ‘సాహో’, ‘రన్ రాజా రన్’ వంటి సినిమాలను తీసిన సుజిత్ ఈ గ్యాంగస్టర్ డ్రామాకు(Pawan OG) దర్శకుడు. ఇమ్రాన్ హష్మి ఈ చిత్రంలో విలన్‌గా నటించనున్నట్లుగా తెలిసింది. ఇందులో ప్రియాంకా అరుల్ మోహన్ హీరోయిన్. డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు.
ముంబై మాఫియా నేపథ్యంలో ఈ సినిమా కథంన సాగుతుంది. పదిసంవత్సరాల తర్వాత ఓ డాన్ తిరిగి వస్తే ఏం జరుగుతుంది? అతను ముంబైలో సృష్టించి వెళ్లిన ఓ తుఫాన్ ఏంటి? ఆ మారణహోమం తాలుకు ప్రభావం అతని జీవితాన్నిఏ విధంగా మార్చింది? అనేవి ‘ఓజీ’ సినిమాలో హైలైట్స్‌గా చెప్పుకుంటున్నారు.
MegaMovies: మెగాకాంపౌడ్లో పది సినిమాలు క్యాన్సిల్?
ఓజీ సినిమా సెప్టెంబరు 27న విడుదల కానుంది. పవన్‌కళ్యాణ్ కెరీర్‌లోని ఓ బ్లాక్‌బస్టర్ ఫిల్మ్ ‘అత్తారింటికి దారేది’ కూడా సెప్టెంబరు 27నే విడుదల కావడం మెగాఫ్యాన్స్కు ఖుషీ నిచ్చే అంశం. ఇక ఓజీ సినిమా షూటింగ్ పూర్తి కావొచ్చింది. కానీ పూర్తిగా పూర్తి కావాలంటే పవన్‌కళ్యాణ్ మరో 20 రోజులు షూటింగ్లో పాల్గొనాలి. కానీ పవన్ ప్రస్తుతం ఏపీ రాజకీయలతోబిజీగా ఉన్నారు.
Pawankalyan: మరోసారి పాట పాడనున్న పవన్ ఏ సినిమాకు తెలుసా
ఈ నేపథ్యంలో ఓజీ సినిమా అనుకున్న సమయానికి విడుదల అవుతుందా? అనే డౌట్స్ తెరపైకి వచ్చాయి. అయితే ఓజీ సినిమా రిలీజ్ విషయంలో ఏ మాత్రం డౌట్స్లేవని తెల్చి చెబుతున్నారు నిర్మాత డీవీవీ దానయ్య.
Pawan Kalyan OG: అత్తారింటికి దారేది సెంటిమెంట్‌తో ఓజీ?
రెండు రోజుల క్రితం ఓ ఈవెంట్లో పాల్గొన్నారు దానయ్య. ఆ వేడుకలో దానయ్యను ఒకరు ఓజీ అప్డేట్ అడిగారు. ఓజీ సినిమా సెప్టెంబరు 27నే విడుదల అవుతుందని, ఏపీ ఎన్నికలు పూర్తికాగానే అంటే…ఏప్రిల్ తర్వాత పవన్‌కళ్యాణ్‌గారు ‘ఓజీ’ సినిమా షూటింగ్లో పాల్గొంటారని దానయ్య స్పష్టం చేశారు. అదీ విషయం మరి.