‘నేనే రాజు నేనే మంత్రి’ చిత్రం తర్వాత హీరో రానా(Rana), దర్శకుడు తేజ (Teja) మరో సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు. గోపీ ఆచంట నిర్మించనున్నారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ షూటింగ్ ప్రారంభం కానుంది. అయితే అప్పుడెప్పుడో అంటే …మూడు సంవత్సరాల క్రితం దర్శకుడు తేజ జన్మదినం సందర్భంగా ‘అలివేలుమంగ వెంకటరమణ’, ‘రాక్షసరాసు రావాణాసుర’ సినిమాలను ప్రకటించారు. వీటిలో ‘అలివేలు మంగ వెంకటరమణ’ చిత్రంలో గోపీచంద్, ‘రాక్షసరాజు రావణాసురుడు’ సినిమాలో రానా హీరోలుగా నటిస్తారని వార్తలు వచ్చాయి. కానీ ఈ రెండు సినిమాలు సెట్స్‌పైకి వెళ్లలేదు. ఇప్పుడు సడన్‌గా రానా, తేజకాంబినేషన్లో సినిమాఅంటూ అనౌన్స్మెంట్ వచ్చింది. మరి…రానా, తేజ కాంబినేషన్లో రూపొందనున్న సినిమా ‘అలివేలు మంగవెంకట రమణ కథా? లేక ‘రాక్షసరాజు రావణాసురుడు’కథా? అనేది తెలియాల్సి ఉంది.
Rana: దర్శకుడు తేజతో మరో మూవీ చేస్తున్న రానా
1 Comment
1 Comment
-
Pingback: Rana: రానాతో నెక్ట్స్ మూవీ రెడీ | tollywoodhub %