Tollywood Christmas 2023: క్రిస్మస్‌కు భారీ బాక్సాఫీస్ పోటీ
May 23, 2023
Updated 2023/05/23 at 1:45 PM
Share
2 Min Read
8Tollywood Christmas 2023
SHARE
సాధారణంగా టాలీవుడ్‌లో క్రిస్మస్ సీజన్(Tollywood Christmas 2023)ను నిర్మాతలు అంతగా పట్టించుకోరు. సంక్రాంతి, దసరా, దీపా వళి, ఉగాది వంటి ఫెస్టివల్స్ సమయంలో విడుదలయ్యే సినిమాల సంఖ్య కాస్త ఎక్కువగా ఉంటుంది. కానీ 2023 క్రిస్మస్ (Tollywood Christmas 2023) సీజన్ సమయంలో బాక్సాఫీస్ వద్ద భారీ పోటీ ఖాయంగా కనిపిస్తోంది.
వెంకటేశ్ (Venkatesh) హీరోగా ‘హిట్’ ఫ్రాంచైజీ ఫేమ్ శైలేష్ కొలను దర్శకత్వంలోని ‘సైంధవ్’ (Saindhav) చిత్రం క్రిస్మస్ సంద ర్భంగా డిసెంబరు 22న విడుదల కానుంది. బాలీవుడ్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్ధికీ ఈ చిత్రంతో తెలుగుపరిశ్రమకు పరిచయం అవుతున్నాడు. శ్రద్ధా శ్రీనాథ్, రుహాని శర్మ, ఆండ్రియా జెర్మియా ఈ చిత్రం హీరోయిన్స్. మెడికల్ క్రైమ్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రం ఉంటుందన్నట్లుగా తెలుస్తోంది.
Venkatesh Saindhav
పవన్‌కళ్యాణ్(Pawankalyan) ప్రజెంట్ చేస్తున్న సినిమాల్లో ‘ఓజీ’ (OG) ఒకటి. సుజిత్ దర్శకుడు. డీవీవీ దానయ్య నిర్మాత. ప్రియాంకా అరుల్ మోహనన్ హీరోయిన్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబైలో జరుగుతోంది.అయితే ఈ సినిమాను డిసెంబరులో అంటే క్రిస్మస్ సందర్భంగా విడుదల చేయాలని పవన్‌కళ్యాణ్ అండ్ సుజిత్ కో ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. గ్యాంగ్‌స్టర్ డ్రామాగా ఈ చిత్రం ఉంటుంది.
PawanKalyan OG
అల్లుఅర్జున్(AlluArjun), దర్శకుడు సుకుమార్ కాంబినేషన్‌లోని ‘పుష్ప: ది రైజ్’ చిత్రం 2021 డిసెంబురులో విడుదలై అద్భుత విజయాన్ని సాధించింది. ప్రస్తుతం ‘పుష్ప’ చిత్రంలోని రెండో భాగం అంటే ‘పుష్ప: దిరూల్ (Pushpa: The Rule) ’ సినిమా సెట్స్‌పై ఉంది. ఇప్పటికే యాభై రోజులకు పైగా షూటింగ్ పూర్తయింది. ఈ సినిమాషూటింగ్‌ను తొందరగా పూర్తి చేసి, 2023 డిసెంబరులో విడుదల చేయాలని చిత్రంయూనిట్ భావిస్తోంది. మైత్రీమూవీమేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్‌లు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
AlluArjun Pushpa The Rule Firstlook Poster
నాని(nani) హీరోగా నటిస్తున్న లేటేస్ట్ ఫిల్మ్ ‘హాయ్ నాన్న’ (Hai Nanna) (వర్కింగ్ టైటిల్). శౌర్యువ్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. చెరుకూరి మోహన్, విజయేందర్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.‘సీతారామం’ ఫేమ్ మృణాల్‌ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్ శ్రుతీహాసన్‌ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాను డిసెంబరు 21న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు మేకర్స్.
Nani30
హీరో సుధీర్‌బాబు(Sudheerbabu) నటిస్తున్న తాజా చిత్రం ‘హరోం హర’(Haromhara). జ్ఞానశేఖర్ ద్వారక డైరెక్టర్. సుమంత్ జినాయుడు ఈ సినిమాకు నిర్మాత. అయితే ‘హరోం హర’ సినిమాను డిసెంబరు 22న రిలీజ్ చేస్తున్నట్లు ఆల్రెడీ ప్రకటించారు మేకర్స్.
SudheerBabu HaromHara
ఇప్పటికే ఐదు సినిమాలు క్రిస్మస్ బాక్సాఫీస్ పోటీలో నిలిచాయి. మరి..ఏ చిత్రం అనుకున్నట్లుగా క్రిస్మస్‌కు విడుదల అవుతుందో, ఏ చిత్రం రిలీజ్ వాయిదా పడుతుందో చూడాలి.