తెలుగు ఇండస్ట్రీలో మాస్ కమర్షియల్ సినిమాలను ప్రేక్షకులు వీపరీతంగా ఆదరిస్తారు. అయితే కథ బాగుం డాలి. కానీ ఈ మధ్య కొందరు కుర్ర హీరోలు మాస్ ట్రాప్‌లో పడి స్క్రిప్ట్ విషయంలో రాజీ పడటం వల్ల నెమో మొదటికే మోసం వస్తుంది. పూరీ జగన్నాథ్ విజయ్ దేవరకొండతో ‘లైగర్’ సినిమా చేయగా డిజాస్టర్
గా నిలిచింది. లేటెస్ట్గా అఖిల్‌తో సురేందర్‌రెడ్డి చేసిన ‘ఏజెంట్’ మూవీది అదే ఫలితం. రీసెంట్గా తమిళ దర్శకుడు రంజిత్ జయకోడితో సందీప్‌కిషన్ చేసిన పీరి యాడికల్ యాక్షన్ మూవీ ‘మైఖేల్’ కూడా డిజాస్టర్‌గా నిలిచింది. అలాగే కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో వరుణ్‌తేజ్ ‘గని’ అనే స్పోర్ట్స్ డ్రామా చేశారు. ఈ సినిమా కోసం వరుణ్‌తేజ్ ఫారిన్లో ట్రైనింగ్ తీసుకున్నారు. బాక్సార్ లుక్ కోసం స్ట్రాంగ్ ఫిజిక్‌ను మెయిన్టెన్చేశారు.
Agent: షారుక్ ‘పఠాన్’..అఖిల్ ‘ఏజెంట్’ కథ సేమ్ టు సేమ్?
‘లైగర్’ కోసం విజయ్‌దేవరకొండ తీసుకున్న రిస్క్, బాడీ మెయిన్టెనెన్స్ చాలా కష్టం.అఖిల్ కూడా ఎంతో కష్టపడ్డారు. అఖిల్ కష్టం స్పష్టంగా స్క్రీన్‌పై కనిపిస్తుంది. సందీప్‌కిషన్ శ్రమను ఏ మాత్రం తీసిపారేయలేం. వరుణ్‌తేజ్ శ్రమను తక్కువ చేయలేం. ఈ కుర్ర హీరోలు వారి వారి సినిమాల కోసం సిక్స్‌ప్యాక్ చేసిన వారే. కోవిడ్కారణంగా షూటింగ్ సుధీర్ఘంగా వాయిదా పడితే ఆ బాడీని, లుక్‌ను చాలా జాగ్రత్తగా మెయిన్‌టెన్ చేశారు. హీరో ఎలివేషన్స్ కోసమో, భారీ యాక్షన్ సీక్వెన్స్‌ల కోసమే, పస లేని కథతో మాస్ ఇమేజ్ కోసమో ఆశపడి కెరీర్‌ను, ఆరో గ్యాన్ని కుర్రహీరోలు పణంగా పెట్టడ పోవడం ఉత్తమం.