హీరో అల్లు అర్జున్(AlluArjun), దర్శకుడు త్రివిక్రమ్(Trivikram)లతి స్పెషల్ బాండింగ్. వీరి కాంబినేషన్లో ఇప్పటివరకు మూడు చిత్రాలు వచ్చాయి. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల.. వైకుంఠపురములో….. ఈ మూడు చిత్రాలు కూడా బ్లాక్‌బస్టర్స్ గా నిలిచాయి. ముఖ్యంగా అల..వైకుంఠపురుములో సినిమా అల్లు అర్జున్ కెరీర్‌ను నెక్ట్స్ లెవల్‌కు తీసు కుని వెళ్లింది. అల్లు అర్జున్ను హిట్ ట్రాక్‌పై నిలబెట్టింది.
అల్లు అర్జున్, త్రివిక్రమ్‌ల కాంబినేషన్లో ఇప్పుడు నాలుగోమూవీ రాబోతుంది. గీతాఆర్ట్స్ బ్యానర్లో ఈ సినిమా ఉంటుంది. 2024లో ఈ సినిమా షూటింగ్‌ను స్టార్ట్ చేస్తారు. ప్రస్తుతం త్రివిక్రమ్ ‘గుంటూరు కారం’ సినిమా చేస్తున్నాడు. మహేశ్‌బాబు హీరో. మరోవైపు అల్లు అర్జున్ ప్రజెంట్ ‘పుష్ప: ది రూల్’తో బిజీగా ఉన్నాడు. వీరిద్దరూ వీరి వీరి కమిట్మెంట్స్ను పూర్తి చేసుకున్న తర్వాత వీరికలయికలోని సినిమా సెట్స్‌పైకి వెళుతుంది.