Rana: రానా ప్రస్తుతం ‘రాక్షసరాజా’ సినిమా చేస్తున్నారు. ‘నేనే రాజు నేను మంత్రి’తో రానాకు హిట్ ఇచ్చిన తేజ ఈ సినిమాకు దర్శకుడు. పీరియాడికల్ గ్యాంగ్‌స్టర్ డ్రామాగా ఈ చిత్రం ఉంటుంది. రాజశేఖర్ ఓ కీలక పాత్రధారి. అయితే ఈ సినిమా సెట్స్‌పై ఉండగానే మరో సినిమాకు రానా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారని తెలిసింది. ‘సావిత్రి’ సినిమా, ‘సేనాపతి’, ‘దయ’ వంటి వెబ్‌సిరీస్‌లు తీసిన దర్శకుడు పవన్సాధినేనితో రానా ఓ సిని మా చేయనున్నారు. ధీరజ్ మోగిలినేని ఈ సినిమాకు ఓ నిర్మాత అని తెలిసింది. ప్రస్తుతం బెల్లకొండ గణేష్‌తో ఓసినిమా చేస్తున్నారు పవన్ సాధినేని. ఈ చిత్రం పూర్తికగానే రానాతో సినిమాను సెట్స్‌కు తీసుకువెళ్లారు పవన్‌సాధినేని. ఇక గతంలో పవన్‌సాధినేని హీరో వరుణ్‌తేజ్‌కు ఓ కథ చెప్పారు. కానీ ఆ సినిమా వర్కౌట్ కాని సంగతి తెలిసిందే.
Rana: రానా నెక్ట్స్ మూవీ రెడీ
Leave a comment
Leave a comment