ప్రభాస్, పూజాహెగ్డే జంటగా రాధాకృష్ణకుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా రాధేశ్యామ్’ చిత్రం నుంచి వాలెంటెన్స్ డే గిప్ట్ వచ్చేసింది. ఈ సినిమాకు సంబంధించిన కొత్త టీజర్ రిలీజైంది. ఈ టీజర్‌తో జ్యోతిష్కుడు విక్రమాదిత్య పాత్రలో ప్రభాస్ కనిపిస్తారని ఇప్పటివరకు తెలిసిన ప్రేక్షకులకు, ఇప్పుడు ప్రేరణగా పూజాహెగ్డే డాక్టరు పాత్రలో కనిపిస్తారని కన్ఫార్మ్ అయిపోయింది. ఓ ప్రకృతి విపత్తు కార ణంగా ఒక జన్మలో విడిపోయిన ప్రేమికులు మరు జన్మలో ఎలా కలుసుకుంటారు అన్నదే ‘రాధేశ్యామ్’కథ. సత్యరాజ్, కృష్ణంరాజు, భాను శ్రీ కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాకు తమన్ బ్యాగ్రౌండ్ స్కోర్అందిస్తున్నారు. రాధేశ్యామ్ సినిమా మార్చి 11న విడుదల కానుంది.