PrabhasKalki2898AD: ప్రభాస్ హీరోగా చేస్తున్న తాజా చిత్రం ‘కల్కి 2898ఏడీ’.ఈ సైన్స్ ఫిక్షన్ అండ్ ఫ్యూచరిస్ట్ యాక్షన్ ఫిల్మ్‌కు (PrabhasKalki2898AD) నాగ్ అశ్విన్ దర్శకుడు. దీపికా పదుకొనె, దిశాపటానీ హీరోయిన్స్‌గా నటిస్తున్న ఈ సినిమాలో కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మార్చి 8న శివరాత్రి మహాపర్వదినాన్ని పురస్క రించుకుని ఈ సినిమాలో ప్రభాస్ పాత్ర ఫస్ట్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సినిమాలో భైవర అనే పాత్రలో ప్రభాస్ నటిస్తున్నట్లుగా వెల్లడించారు. ఆరు వేల సంవత్సరాల స్పాన్‌లో ‘కల్కి 2898ఏడీ’ సినిమా ఉంటుంది. ఈ సినిమా నాలుగైదు భాగాలుగా విడుదల కానుందనే టాక్ వినిపిస్తోంది. మహాభారతం కాలం నుంచి మొదలయ్యే ఈ సినిమా కథ 2898 ఏడీ వరకూ సాగుతుందని నాగ్ అశ్విన్ ఇటీవల వెల్లడించారు. ఈ సినిమాను మే 09న విడుదల చేయాలను కుంటున్నారు. ఒకవైపు పోస్ట్ ప్రొడక్షన్స్ శరవేగంగా జరుగుతున్నాయి. అయితే తాజాగా పోస్టర్లో చిత్రంయూనిట్ రిలీజ్ డేట్‌ను కన్ఫార్మ్ చేయలేదు. దీంతో ‘కల్కి 2898ఏడీ’ సినిమా రిలీజ్ ఏమైనా వాయిదా పడుతుందా? అనే అనుమనాలు వ్యక్తం అవుతున్నాయి ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో.
మరోవైపు ‘కల్కి 2898ఏడీ’ సినిమా తొలిభాగం షూటింగ్ ఎప్పుడో పూర్తయిందని, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కూడా ఓ కొలిక్కి వచ్చాయని, ఏప్రిల్‌లో ట్రైలర్ విడుదల కానుందని మరో టాక్ కూడా వినిపిస్తోంది. ఈ విషయాలపై కచ్చితమైన స్పష్టత రావాలంటే చిత్రంయూనిట్ మరోసారి రిలీజ్‌డేట్‌ను కన్ఫార్మ్ చేయాల్సిన అవసరం ఉన్నట్లుగా తెలుస్తోంది.
ఈ సినిమా కాకుండా దర్శకుడు ప్రశాంత్‌నీల్‌తో ‘సలార్’లోని రెండో భాగం ‘సలార్: శౌర్యంగాపర్వం’ చేస్తున్నారు ప్రభాస్. ‘అర్జున్‌రెడ్డి’, ‘యానిమల్’ సినిమాల ఫేమ్ సందీప్‌రెడ్డి వంగాతో ‘స్పిరిట్’ సినిమా ఈ ఏడాది చివర్లో ప్రారంభం అవుతుంది. మారుతి దర్శకత్వంలో ప్రభాస్ చేస్తున్న ‘రాజాసాబ్’ చిత్రీకరణ జూన్‌లోపు ఓ కొలిక్కి రానుంది. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు చిత్రంయూనిట్. ఇంతటితోనే ప్రభాస్ లైనప్ ఆగిపోలేదండీ. ‘సీతారామం’ ఫేమ్ హనురాఘవ పూడితో ప్రభాస్ ఓ సినిమా కమిటైయ్యారు. మైత్రీమూవీమేకర్స్ నిర్మిస్తారు. ప్రస్తుతం ఈ సినిమా మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయి. వచ్చే ఏడాది ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. సరిహద్దుగా ప్రేమకథగా ఈ చిత్రం ఉండనున్నట్ల గా తెలుస్తోంది.