ప్లాన్ చేసిన ప్రకారం వెంకటేశ్, వరుణ్‌తేజ్ హీరోలు అనిల్‌రావిపూడి తీసిన ఫన్ ఫిల్మ్ ‘ఎఫ్ 3’ ఏప్రిల్ 29న, చిరంజీవి హీరోగా, రామ్‌చరణ్ కీలక పాత్రలో నటించిన ‘ఆచార్య’ ఏప్రిల్ 28న రిలీజ్ కావాలి. కానీ ఫిబ్రవరి
14న ‘ఎఫ్ 3’ కొత్త రిలీజ్ డేట్ వచ్చింది. తమ సినిమాను మే 27న విడుదల చేయాలనుకుంటున్నట్లుగా,
ఇదే ఫైనల్ రిలీజ్ డేట్ అన్నట్లుగా కూడా ఈ చిత్రం నిర్మాతలు ‘దిల్’రాజు, శిరీష్ పేర్కొన్నారు. అయితే చిరంజీవి ‘ఆచార్య’ సినిమాకు పోటీగా ఉండటంఇష్టం లేకనే ‘దిల్’ రాజు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ఫిల్మ్‌నగర్‌లో వార్తలు వస్తున్నాయి.
F3 First Single Lab Dab Lab Dab Dabboo Out Now


ఇంతవరకుబాగానే ఉంది కానీ మే 27 ‘ఉప్పెన’ ఫేమ్ వైష్ణవ్‌తేజ్ హీరోగా నటిస్తున్న ‘రంగరంగ వైభవంగా..’ చిత్రంవిడుదలకు షెడ్యూలైంది. కానీ ఇప్పుడు ఈ తేదీన ‘ఎఫ్ 3’ వస్తుండటంతో వైష్ణవ్‌తేజ్ టెన్షన్లో పడ్డాడు. తన సినిమాను వాయిదా వేయాలనే ఆలోచనలో ఉన్నారట వైష్ణవ్‌తేజ్. గిరీశాయ దర్శకత్వంలో బాపినీడు నిర్మిస్తున్న ఈ రంగరంగ వైభవంగా చిత్రంలో కేతికాశర్మ హీరోయిన్. #vishnavtej


ఇలా..ఆచార్య సినిమాకు సోలో రిలీజ్ ఇవ్వడం కోసం ఎఫ్ 3 చిత్రం మే 27కు రిలీజ్ మార్చుకోవడం వైష్ణవ్‌కు ఇబ్బందైపోయింది. మరి..వైష్ణవ్ రిలీ జ్ను మార్చుకుంటే ఓకే..లేకపోతే ఆచార్య (చిరంజీవి) కారణంగా బాక్సాపీసు వద్ద వరుణ్‌తేజ్, వైష్ణవ్ తేజ్‌ల మధ్య బాక్సాఫీసు పోరు తప్పదు.