సమ్మోహనం, వి చిత్రాల తర్వాత హీరో సుధీర్‌బాబు, దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో రూపొందుతోన్న తాజా చిత్రం ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’. కృతీశెట్టి ఈ సినిమాలో హీరోయిన్. జనవరి 22న ఈ సినిమా టీజర్ విడుదలైంది. సినిమాలు తీసే దర్శకుడి పాత్రలో సుధీర్‌బాబు, డాక్టర్ అలేఖ్య పాత్రలో కృతీశెట్టి కనిపిస్తారు. ఈ సినిమాను ఇదే ఏడాది విడుదల చేయాలనుకుంటున్నారు. ఇక సమ్మోహనం చిత్రంలో హీరోయిన్ క్యారెక్టర్‌కు సినిమాలో సినిమా బ్యాక్‌డ్రాప్‌ను ఇంద్రగంటి మోహనకృష్ణ ఇప్పుడు ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ చిత్రంలో హీరో క్యారెక్టర్‌కు సినిమా బ్యాక్‌డ్రాప్ పెట్టడం గమనించాల్సిన విషయం. ‘నాకు సినిమా సినిమాలంటే అస్సలు పడవండీ’, ‘ఇన్ని రోజులు నన్ను నేను నమ్ముకుని సినిమా తీశాను. తొలిసారి నన్ను నేను నమ్ముకుని సినిమా తీయాలనుకుంటున్నాను’, ‘నేను మీ సినిమాలో యాక్ట్ చేస్తాను. కానీ ఒక కండీషన్’ అన్న డైలాగ్స్‌ను టీజర్లో గమనించవచ్చు.