చిరంజీవి హీరోగా చేసిన ఆచార్య సినిమా విడుదల మరోమారు సందిగ్ధంలో పడింది. ‘ఆర్‌ఆర్‌ఆర్’ కంటే ముందు ‘ఆచార్య’ సినిమాను విడుదల చేయకూడదని రాజమౌళి కండీషన్ పెట్టడం వల్లే ఆచార్య చిత్రం లో రామ్‌చరణ్ యాక్ట్ చేయగలిగాడు (ఆచార్య సరిగా ఆడకపోతే ఆ ఎఫెక్ట్ ఆర్‌ఆర్‌ఆర్‌పై పడుతుందని భావించి రాజమౌళి ఈ కండీషన్ పెట్టి ఉండవచ్చు) . ఆచార్యలో రామ్‌చరణ్ మినహా రాజమౌళితో సినిమా చేస్తున్నప్పుడు మరే ఇతర హీరో కూడా మరో సినిమాలో నటించలేదు. అయితే ఇటీవల ఫిబ్రవరి 4 నుంచి ఆచార్య సినిమాను ఏప్రిల్1 కి షిఫ్ట్ చేశారు. అనుకున్న తేదీకి ఆచార్య రావాలంటే మార్చి 18న ఆర్‌ఆర్‌ఆర్ విడుదల కావాలి. ఒకవేళ ఆర్‌ఆర్‌ఆర్ మార్చి 18న విడుదల కాలేకపోయి, ఏప్రిల్ 28న విడుదలకు సిద్ధం అయితే ఆచార్య రిలీజ్ వాయిదా పడకతప్పదు. అంతేకాదండోయ్..ఫిబ్రవరి 25న విడుదలకు షెడ్యూల్ అయిన పవన్ కల్యాన్ ‘భీమ్లానాయక్’ చిత్రం కూడా ఏప్రిల్ 1న వచ్చేందుకు ప్లాన్స్ వేస్తోందట. అయితే ఆర్‌ఆర్‌ఆర్ ఏప్రిల్ 28న రిలీజ్‌కు రెడీ అయితే అప్పుడు ఆచార్య విడుదల కాదు కాబట్టి భీమ్లానాయక్ ఏప్రిల్ 1న థియేటర్స్‌కు రావాలని భీమ్లానాయక్ ప్లాన్ చేస్తున్నాడని బోగట్టా.
అప్పుడు ఆచార్య విడుదల వాయిదా పడక తప్పదు!
Leave a comment
Leave a comment