AlluSirish Buddy: తమిళ నటుడు ఆర్య హీరోగా నటించిన చిత్రం ‘టెడ్డీ’. శక్తి సౌందర్ రాజన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా 2021లో డైరెక్ట్‌గా హాట్‌స్టార్ ఓటీటీలో విడుదలై, చెప్పుకోదగ్గ మూవీగా నిలిచింది. ఈ మూవీ తెలుగు వెర్షన్ కూడా అప్పట్లో స్ట్రీమింగ్ అయ్యింది. అయితే ఇప్పుడు ఈ సినిమా పోస్టర్స్‌ను కలిగి ఉన్నట్లే తెలుగు మూవీ ‘బడ్డీ’ పోస్టర్స్ ఉన్నాయి. దీంతో ‘టెడ్డీ’ సినిమాకు బడ్డీ తెలుగు రీమేక్ అనే టాక్ వినిపించింది. కానీ ఇదేం కాదని, టెడ్డీ…బడ్డీ వేరు వేరు అని చెబుతున్నారు హీరో అల్లు శిరీష్ (AlluSirish Buddy)
అల్లు శిరీష్, గాయత్రి భరద్వాజ్, అజ్మల్ అమీర్, ప్రిషా రాజేశ్ సింగ్, ముఖేష్ కుమార్, అలీ లీడ్ రోల్స్‌లో నటించిన చిత్రం ‘బడ్డీ’. శామ్ ఆంటోనీ డైరెక్షన్‌లోని ఈ సినిమాను కేఈ జ్ఞానవేల్ రాజా, అధన్ జ్ఞానవేల్ రాజా నిర్మించారు. ‘టెడ్డీ’ సినిమా జూలై 26న థియేటర్స్‌లో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ వేడుక హైదరాబాద్‌లో జరిగింది.
ఈ సందర్భంగా అల్లు శిరీష్ బడ్డీ, టెడ్డీ సినిమాలకు సంబంధం లేదన్టుగా మాట్లాడారు.
‘బడ్డీ సినిమా అనౌన్స్మెంట్ పోస్టర్ రాగానే..బడ్డీ సినిమా రీమేక్. ఓరిజినల్ మూవీని మేం ఓటీటీలో చూశాం. మళ్లీ చేస్తున్నారు అనే మాటలు వినిపించాయి. అయితే నేను ఎంత వివరణ ఇచ్చినా ఆడి యన్స్, ఫ్యాన్స్ కాదంటూనే ఉంటారు. బడ్డీ రోటీన్ సినిమా కాదు’ అంటూ చెప్పుకొచ్చారు అల్లు శిరీష్.
బడ్డీ సినిమాను తొలుత సందీప్‌కిషన్ చేయాల్సింది. కానీ ఆ తర్వాత అల్లు శిరీష్ లైన్లోకి వచ్చారు అన్నది పాత విషయమే.