Kalki2898admovie: ప్రభాస్ హీరోగా నటించిన ‘కల్కి2898ఏడీ’ సినిమాపై ఇండస్ట్రీలో భారీ అంచనాలు ఉన్నాయి. దాదాపు ఐదు సంవత్సరాల నిర్మాణం అనంతరం ఈ సైంటిఫిక్ అండ్ ఫ్యూచరిస్టిక్ ఫిల్మ్ ‘కల్కి2898ఏడీ’ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన, ప్రత్యేకమైన విశేషాలు (Kalki2898admovie).
-
- ప్రభాస్‌తో 2008 నుంచి నాగ్ అశ్విన్ ఓ సినిమా చేయాలనుకుంటున్నారు. ఫైనల్‌గా అది ‘కల్కి2898ఏడీ’ సినిమాతో కుదిరింది. ‘కల్కి2898ఏడీ’ (Kalki2898admovie)సినిమాను 2020 ఫిబ్రవరి 26న ‘ప్రాజెక్ట్ కె’ టైటిల్‌తో అధికారికంగా ప్రకటించారు. 2023 జూలై 20న ప్రాజెక్ట్ కె టైటిల్‌ను ‘కల్కి2898ఏడీ’గా మార్చారు.
- ‘కల్కి2898ఏడీ’ (Kalki2898admovie) సినిమాలో ప్రభాస్ హీరోగా నటించారు. భైరవ పాత్రలో ప్రభాస్, సుమతి పాత్రలో దీపికా పదుకొనె, సుప్రీమ్ యాక్సిన్ పాత్రలో కమల్‌హాసన్, అశ్వత్థామ పాత్రలో అమితాబ్‌బచ్చన్, కైరాపాత్రలో మలయాళ నటి అన్నా బెన్, మరియమ్ పాత్రలో మలయాళ సీనియర్ నటి శోభన, రోక్సీగా దిశా పటానీ, రంజన్‌గా బ్రహ్మానందం, వీరన్గా తమిళ నటుడు పశుపతి, ఉత్తర పాత్రలో మాళవికానాయర్, కమాండర్ మానస్‌గా బెంగాలీ నటుడు స్వస్తిక్ ఛటర్జీ, ఓ కీలక పాత్రలో రాజేంద్రప్రసాద్ కనిపిస్తారు. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ, దుల్కర్సల్మాన్, రాజమౌళి, నాని వంటివారు ఉన్నారు. వీరి పాత్రలు సినిమాలో సర్ ప్రైజింగ్‌గా ఉంటాయి. అలాగే ప్రభాస్ వాహనం బుజ్జికి హీరోయిన్ కీర్తీసురేష్ వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఈ కారు కోసమే దాదాపు 4 కోట్ల రూపాయాలను ఖర్చుపెట్టారు మేకర్స్.
- – ‘కల్కి2898ఏడీ’ సినిమాను దాదాపు 600 కోట్ల రూపాయల బడ్జెట్‌తో సి.అశ్వినీదత్ నిర్మించారు. వైజ యంతీ మూవీస్ 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఈ సినిమాను స్టార్ట్ చేశారు అశ్వ నీదత్. నాగ్ అశ్విన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. అయితే నాగ్అశ్విన్ దర్శకత్వంలోని ‘మహానటి’సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్‌గా వర్క్ చేసిన మిక్కీ జే మేయర్, డీవోపీ డానీ లోఫేజ్ ‘కల్కి2898ఏడీ’ సినిమాకూ తొలుత సైన్ చేశారు. కానీ ఆ తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ మిక్కీ, కెమెరామెన్‌గా డానీ ఇద్దరూ తప్పుకున్నారు. ఫైనల్‌గా మ్యూజిక్ డైరెక్టర్‌గా సంతోష్నారాయణన్, కెమెరామేన్‌గా జోర్డే›్జ ఫైనల్ అయ్యారు.
-
నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన బ్లాక్‌బస్టర్ ఫిల్మ్్స భైరవద్వీపం, ఆదిత్యా 369 సినిమాలకు దర్శకత్వం వహించిన సింగీతం శ్రీనివాసరావు తొలుత ‘కల్కి2898ఏడీ’ సినిమాకు మెంటర్‌గా ఉన్నారు. కొన్ని రోజులు ఆయన తన సలహాలు, సూచనలు ఇచ్చిన తర్వాత ఈ ప్రాజెక్ట్‌ను వైదొలిగినట్లుగా వార్తలు ఉన్నాయి.
ఇప్పటివరకూ నాగ్అశ్విన్ దర్శకత్వంలో వహించిన ‘ఎవడే సుబ్రహ్యాణ్యం’, ‘మహానటి’ సినిమాల్లో విజయ్‌దేవరకొండ, మాళవికానాయర్లు యాక్ట్ చేశారు. తాజా ‘కల్కి2898ఏడీ’లోనూ ఈ ఇద్దరు యాక్ట్ చేయడం విశేషం.
- Kalki2898adbusiness: కల్కి2898ఏడీ బిజినెస్ డిటైల్స్ ఇవిగో…
– ‘కల్కి2898ఏడీ’ సినిమాను తొలుత 2024 సంక్రాంతి సందర్భంగా విడుదలకు ప్లాన్ చేశారు. ఆ తర్వాత మే 9న రిలీజ్ ప్రకటించారు. దేశంలోని సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ‘కల్కి2898 ఏడీ’ సినిమాను ఫైనల్‌గా జూన్ 27న విడుదల చేస్తున్నారు.
- –2006లో వచ్చిన ‘గేమ్’ సినిమా తర్వాత మలయాళ నటి శోభన తిరిగి తెలుగులో నటించిన సినిమా ‘కల్కి 2898ఏడీ’. అంటే దాదాపు 18 సంత్సరాల తర్వాత శోభన తెలుగులో నటించారు. అమితాబ్‌బచ్చన్, కమల్‌హాసన్ దాదాపు 40 ఏళ్ల తర్వాత కలిసి నటించిన చిత్రం ‘కల్కి2898ఏడీ’. గతంలో ఈ ఇద్దరూ ‘గిరా ఫ్తార్’ అనే హిందీ చిత్రంలో నటించారు. ‘గిరాఫ్తార్’లో రజనీకాంత్ కూడా ఓ కీ రోల్ చేశారు. ఇక బాలీవుడ్ టాప్ హీరోయిన్స్‌లో ఒకరైన దీపికా పదుకొనెకు తెలుగులో తొలి చిత్రం ‘కల్కి2898ఏడీ’ సినిమాయే కావడం విశేషం. 2015లో వచ్చిన ‘లోఫర్’తో దిశాపటానీ తెలుగులో హీరోయిన్గా పరిచయం అయ్యారు. మళ్లీ దిశాపటానీ చేసిన రెండో సినిమా ‘కల్కి2898ఏడీ’ సినిమా.
కల్కి కథ ఉహాగానాలు
- టైమ్ట్రావెల్డ్ అండ్ ఫ్యూచరిస్టిక్ మూవీ ‘కల్కి2898ఏడీ’ సినిమా ప్రధానంగా కాశీ, శంభాల, కాంప్లెక్స్ అనే మూడు నగరాల నేపథ్యంలో ఉంటుంది. ప్రపంచంలో భూమిపై నివాసయోగ్యమైన చివరి నగరంకాశీ. జీవించడానికి అన్నీ వసతులు ఉన్న నగరం క్లాంపెక్స్. కాంప్లెక్స్ నగరంలో జరుగుతున్న అక్రమాలకుబలిపశువులు అయినవారు, అన్నిమతాల శరణార్థులు ఉండే స్థలం శంబాల. కాంప్లెక్స్‌లో గర్భవతి అయినసుమతి శంబాలకు వస్తుంది. సుమతిని, ఆమె గర్భంలోని శిశువును చంపేందుకు సుప్రీమ్ యాక్సిన్ ఆదేశాలతో కాశీకి వస్తాడట కమాండర్ మానస్. ఎలాగైనా కాంప్లెక్స్‌కు వెళ్లాలనుకుంటున్న భైవరకు సుమతిని తీసుకు వచ్చే బాధ్యతను ఇస్తాడు. భైరవ ఒప్పుకుంటాడు. కానీ భైరవకు అడ్డుగా అశ్వత్ధామ నిలుస్తాడు.భైవర, అశ్వత్థామలకు మధ్య యుద్ధం జరుగుతుంది. అప్పుడు భైరవ గతాన్ని గ్రహించి, అశ్వత్థామ అతనికి చెబుతాడు. భైరవ మారిపోయి క్లాంపెక్స్‌కు రాజైన సుప్రీమ్ యాక్సిన్కు ఎదురు తిరుగుతాడు. ఈ నెక్ట్స్ ఏం జరుగుతుంది అనేదే ‘కల్కి 2898ఏడీ’ తొలిభాగం కథ అని ప్రచారం జరుగుతోంది.
- కథకు మహాభారతం ఎపిసోడ్ ఉంటుంది. క్రీస్తుపూర్వం 3వ శతాబ్దంలో శ్రీకృష్ణుడు మరణిం చినప్పటి నుంచి 2898ఏడీ వరకు ఈ సినిమా కథ ఉంటుంది. పైన ప్రస్తావించిన కాశీ, శంబాల, కాంప్లెక్స్ ఈ 2898ఏడీ కాలానికి చెందినవే. అయితే 3వ శతాబ్ధంలో ద్వాపరయుగంలో జరిగిన కురుక్షేత్ర యుద్ధానికి, ఇప్పటి ఈ కాశీ, శంబాల, కాంప్లెక్స్ నగరాలకు ఉన్న సంబంధం ఏమిటి? అన్నది సినిమాలో ప్రధానాంశం.
- ‘కల్కి2898ఏడీ’ సినిమా మొదలైన 20 నిమిషాల వరకు ప్రభాస్ స్క్రీన్‌పై కనిపించరు. సెకండాఫ్‌లో 80శాతం యాక్షన్ ఉంటుంది. విజయ్‌దేవరకొండ పాత్ర క్లైమాక్స్‌లో ఉంటుందట.
- ‘కల్కి2898ఏడీ’ సినిమాకు రెండో పార్టు కూడా ఉంటుంది. అసలు..’కల్కి2898ఏడీ’ సినిమా ఐదారుభాగాలుగా విడుదల కానుందనే ప్రచారం కూడా జరుగుతోంది. అయితే ‘కల్కి2898ఏడీ’ సినిమా తొలిపార్టు విజయంపై తర్వాతి పార్టుల విజయాలు ఆధారపడి ఉంటాయి. అలాగే ఈ సినిమాలో ప్రభాస్ ఐదు విభిన్నమైన పాత్రల్లో కనిపిస్తారనే ప్రాచారం సాగుతోంది.