విజయ్ దేవరకొండ హీరోగా చేస్తున్న ‘లైగర్’ చిత్రంలో బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ ఓ కీలక పాత్ర చేస్తున్నారు. ప్రస్తుతం లాస్వేగాస్లో ప్రారంభమైన ‘లైగర్’ కొత్త షెడ్యూల్లో మైక్‌టైసన్, విజయ్ దేవరకొండలపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. విజయ్ దేవరకొండ ఈ సినిమాలో బాక్సర్ కాబట్టి విజయ్ పోటీలో పాల్గొనే ఛాపింయన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ షూటింగ్ లాస్వేగాస్లో జరుగుతుందని ఉహించవచ్చు. ఇక ఈ లైగర్ సినిమాకు పూరీ జగన్నాథ్ దర్శకుడు. అయితే ఇంకా ‘లైగర్’ సినిమా విడుదల తేదీపై ఓ స్పష్టత రాలేదు.