Yash Toxic: ఇండియన్ స్టార్ హీరోల్లో యశ్ ఒకడిప్పుడు. ‘కేజీఎఫ్’ ఫ్రాంచైజీ యశ్ (Yash Toxic)కు ఆ ఇమేజ్‌ని తెచ్చిపెట్టింది. అలాంటి ‘కేజీఎఫ్’ చిత్రం తర్వాత యశ్ లెటెస్ట్ మూవీ ‘టాక్సిక్’. మలయాళ దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. కెవిన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. ఈ సినిమాలో కరీనాకపూర్, శ్రుతీహాసన్లు హీరోయిన్స్‌గా నటిస్తారనే టాక్ వినిపించింది. అలాగే ‘టాక్సిక్’ సినిమాలో షారుక్‌ఖాన్ ఓ గెస్ట్ రోల్ చేయనున్నారనే టాక్ తెరపైకి వచ్చింది. కానీ ‘టాక్సిక్’ సినిమాలో షారుక్‌ఖాన్ గెస్ట్ రోల్ చేస్తున్నారన్న వార్తల్లో ఏ నిజం లేదని యశ్ పేర్కొన్నారు. అలాగే తెలుగు బ్లాక్‌బస్టర్ ‘హను–మాన్’ సీక్వెల్ ‘జై హనుమాన్’లోనూ తాను నటించడం లేదున్న విషయాన్ని చెప్పుకొచ్చారు యశ్.
యశ్ టాక్సిక్ సినిమాలో షారుక్‌ఖాన్ నటిస్తారనేది ముందు నుంచి నమ్మశక్యం కానీ విషయం. ఎందు కంటే….యశ్ ‘కేజీఎఫ్: చాఫ్టర్ 1’ విడుదలైన రోజునే 2018 December 21, షారుక్‌ఖాన్ ‘జీరో’ చిత్రం విడుదలైంది. యశ్ ‘కేజీఎఫ్’ బ్లాక్‌బస్టర్‌గా నిలవగా, ‘జీరో’ డిజాస్టర్‌గా నిలిచింది. ‘జీరో’ సినిమా రిజల్ట్‌ను షారుక్‌ఖాన్‌ను ఎంత నిరాశపరచింది అంటే.. .దాదాపు నాలుగు సంవత్సరాల తర్వాత కానీ షారుక్‌ఖాన్ మరో కొత్త సినిమాకు సైన్ చేయలేదు. అలాంటి పరిస్థితులను మర్చిపోయి ఇప్పుడు యశ్‌కు సాయంగా షారుక్‌ఖాన్ ‘టాక్సిక్’లో నటిస్తాడనుకోడం కరెక్ట్ కాదనే అనుకున్నారు అందరు. అదే నిజమైంది.
ఇక ‘జీరో’ తర్వాత షారుక్ చేసిన ‘పఠాన్’, ‘జవాన్’ చిత్రాలు బ్లాక్‌బస్టర్‌గా నిలవగా, ‘డంకీ’ ఫర్వాలేదనిపించింది.
Tollywood Debut heroines 2024: తెలుగులో ఈ ఏడాది పరిచయం అవుతున్న హీరోయిన్స్ సంఖ్య పెద్దదే
Tollywood: బాహుబలిని ఫాలో అవుతున్న దేవర, గేమ్‌చేంజర్, సలార్ చిత్రాలు