Megha Akash: హీరోయిన్ మేఘా ఆకాష్ తల్లి మేఘా బుందు నిర్మాతగా మారిన సంగతి తెలిసిందే. రాహుల్ విజయ్, మేఘా ఆకాష్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది.ఎ. సుశాంత్‌రెడ్డి, అభిషేక్ కోట నిర్మిస్తున్న ఈ సినిమాతో అభిమన్యు బుద్ది దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.గోవా బ్యాక్ డ్రాప్లో ఈ సినిమా కథనం సాగుతుంది. పది రోజులు గోవాలో, మరో పదిహేను రోజులు హైదరాబాద్‌లో షూటింగ్ చేసి ఎంటైర్ సినిమాకు గుమ్మడికాయ కొట్టాలని చిత్రంయూనిట్ భావిస్తోంది. రాజేంద్రప్రసాద్, అర్జున్ కల్యాణ్, ‘వెన్నెల’ కిశోర్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు హరి గౌర మ్యూజిక్ డైరెక్టర్.