Raviteja: రవితేజ (Raviteja) హీరోగా నటిస్తున్న తాజా చిత్రాల్లో ఒకటైన ‘రామారావు: ఆన్ డ్యూటీ’ (Ramarao on duty) సినిమా విడుదల తేదీ ఖరారైంది. ఈ సినిమాను జూన్ 17న విడుదల కానుంది. ఈ సినిమా విడుదలకు మార్చి 25, ఏప్రిల్ 1 తేదీలను పరిశీలించి నప్పటికీని ఫైనల్‌గా జూన్ 17(Ramarao on duty on june 17) ఫైనల్ చేసుకున్నారు. ఈ చిత్రంతో శరత్ మండవ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. దివ్యాంశ కౌశిక్, రజీషా విజయ్ ఈ చిత్రంలో హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. వేణు తొట్టెంపూడి, సీనియర్ నరేశ్ కీలక పాత్రధారులు. వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ చిత్రంలో రవితేజ ప్రభుత్వ అధికారి ఎమ్మార్వో పాత్రలో కనిపిస్తారు. ఈ చిత్రాలు కాకుండా రవితేజ ‘ధమాకా’, ‘రావాణాసుర’, ‘టైగర్ నాగేశ్వర రావు బయోపిక్’ చిత్రాలు చేస్తున్నారు.

