హీరో ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో వచ్చిన తొలి చిత్రం ‘జనతాగ్యారేజ్’లో మోహన్‌లాల్ చేసిన పాత్ర సినిమాపై ఎంతటి ప్రభావం చూపిందో, ఎంత కీలకంగా మారిందో తెలిసిందే. అయితే ఇప్పుడు అలాంటి పాత్రనే తాజాగా ఎన్టీఆర్‌తో కొరటాల శివ చేయబోయే సినిమాలో ఉందట. ఈ పాత్ర కోసం రాజ శేఖర్ అయితే ఎలా ఉంటుంది? అనే ఆలోచనలు చేస్తున్నారట కొరటాల శివ. ఇటు రాజశేఖర్ కూడా స్క్రిప్ట్ అందులోకి క్యారెక్టర్ నచ్చితే చేస్తారు. సో..మరి ఎన్టీఆర్, కొరటాల లేటెస్ట్ ఫిల్మ్‌లో రాజశేఖర్ కనిపిస్తారా? లెట్స్ వెయిట్ అండ్ సీ. ఇక ఈ సినిమా ప్రారంభోత్సవం ఈ నెల 7న జరగు తుంది. ఈ చిత్రంలో ఆలియాభట్ హీరోయిన్గా కనిపిస్తారనే ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయాలపై త్వరలో ఓ స్పష్టత రానుంది.